Anchor Secret Marriage: గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న యాంకరమ్మ.. ఫోటోలు వైరల్..!

Anushree Marriage : కన్నడ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనూ శ్రీ తాజాగా రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అబ్బాయి ఎవరు ? ఏం చేస్తుంటారు అనే విషయాలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

1 /6

చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు చేసుకుని సడన్ షాక్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలా కన్నడ సినీ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పేరుపొందిన ఒక యాంకర్ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆ యాంకర్ ఎవరు.. ఎవరిని వివాహం చేసుకుంది? అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.  

2 /6

కన్నడ సినీ పరిశ్రమలో యాంకర్ గా తనదైన ముద్ర వేసుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనుశ్రీ, అక్కడ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఈమె వివాహ విషయం పైన అభిమానులలో ఇంకా ఎందుకు వివాహం చేసుకోలేదనే ప్రశ్న తలెత్తింది.  కానీ ఈ విషయం పైన అనుశ్రీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు.

3 /6

అయితే  తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ నటుడిని వివాహం చేసుకున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అనుశ్రీ యాంకర్ గానే కాకుండా రియాల్టీ షోలకు అలాగే సినిమా ఆడియో ఫంక్షన్లకు తదితర ప్రోగ్రామ్స్ కి కూడా హోస్ట్ గా పని చేస్తూ ఉండేదట. 

4 /6

ఇలా భారీగానే సంపాదిస్తున్న అనుశ్రీ కి సంబంధించి ఒక పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కన్నడ స్టార్ యాక్టర్ ను స్టేజ్ పై పెళ్లి చేసుకోబోతోందట. ఆ నటుడు ఎవరో కాదు కన్నడలో నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శరణ్ .

5 /6

అయితే ఇది అందరూ అనుకుంటున్నట్లుగా నిజమైన పెళ్లి కాదని ఏదో రియాలిటీ షోలో జరిగేటువంటి కామెడీ మ్యారేజ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలోనే ఇలా నటుడుతో ఘనంగా ఇలా ఎంట్రీ ఇచ్చింది అనే విధంగా కన్నడలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

6 /6

మొత్తానికైతే  గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది అంటూ వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్ల కలల రాణిగా పేరు తెచ్చుకున్న అనుశ్రీ వివాహం చేసుకుందంటే మాత్రం నిజంగా అబ్బాయిలు డిసప్పాయింట్ అవుతారనటంలో సందేహం లేదు.