Paracetamol: పారాసెట్మాల్, విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ ఏం చెప్పారంటే..

Paracetamol Disadvantages: పారాసెటమాల్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే టాబ్లెట్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా జ్వరం మొదలుకొని జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే అందరూ బేసిక్ గా ఉపయోగించే ఒకే ఒక టాబ్లెట్ పారాసెటమాల్. అయితే ఇప్పుడు ఈ డ్రగ్ వాడడం అత్యంత ప్రమాదకరం అంటూ ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ చెప్పుకొచ్చారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 

1 /5

సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసిన పాపులర్ మెడిసిన్ పారాసెటమాల్.. ముఖ్యంగా వైద్యుల సిఫార్సు అవసరం లేకుండా చాలామంది మెడికల్ షాప్ లో కొని వినియోగించే మందులలో ఇది కూడా ఒకటి.  

2 /5

తేలికపాటి నుంచి మితమైన నొప్పిని ఇది తగ్గిస్తుందని అందుకే మెడిసిన్ ఫార్మసీ,  సూపర్ మార్కెట్ ఇతర దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి సులభంగా దీనిని కొనుగోలు చేసి ఉపయోగిస్తూ ఉంటారు.  పారాసెటమాల్ జ్వరాన్ని తగ్గించడంతో పాటు పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంది.   

3 /5

అయితే ఈ మెడిసిన్ వాడకం ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పారాసెటమాల్ వెన్నునొప్పి,  మైగ్రేన్, తలనొప్పి,  కండరాల నొప్పులకు మాత్రమే ఉపయోగించాలి.  పీరియడ్స్ నొప్పి, పంటి నొప్పి, జలుబు,  ఫ్లూ కారణంగా వచ్చే నొప్పులకు కూడా ఇది పనిచేస్తుంది. ఇకపోతే పారాసిటమాల్ డోస్ కి మించి తీసుకోవడం వల్ల తీవ్రమైన లివర్ డ్యామేజ్ కి దారి తీయవచ్చట.

4 /5

పారాసెటమాల్ దీర్ఘకాలం వినియోగిస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కి దారి తీయవచ్చు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదనంగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2013లో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల తీవ్రమైన స్కిన్ రియాక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. 

5 /5

ఇకపోతే పారాసెటమాల్ మాత్రమే కాదు.. విటమిన్ డి3, కాల్షియం, పాన్ -D తోపాటు మొత్తం 50 రకాల డ్రగ్స్ క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయినట్టు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ వెల్లడించింది.  అంతేకాదు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్  కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని లేవనెత్తగా మొత్తం 50 రకాల డ్రగ్స్ పై టెస్టు నిర్వహించగా అన్నీ కూడా క్వాలిటీ టెస్టు ఫెయిల్ అయ్యాయని వీటిని వాడడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేసింది