India Vs Canada: భారత్‌ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్యవేత్తలపై కేంద్రం వేటు..!

India Vs Canada: కెనడా కయ్యానికి కాలు దూస్తూ మన అధికారులను అనుమానితుల  జాబితాలో చేరుస్తున్న నేపథ్యంలో భారత్‌ తీవ్రంగా ఖండించింది. మన దేశంలోని కెనడా అధికారులపై కూడా వేటు వేసింది. భారత్‌ విడిచి వెళ్లాలంటూ ఆ దేశ దౌత్యవేత్తలను ఆదేశించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

కెనడా భారత్‌ పై చేస్తున్న చర్యలకు భారత్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కెనడాలో ఉన్న మన భారతీయ దౌత్య అధికారులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోన్న భారత్‌, అదేవిధంగా మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 10 గంటల వరకు భారత్‌ను వీడి వెళ్లాలని భారత్‌ సూచించింది.  

2 /7

కెనడా మన దేశ దౌత్యవేత్తలు అయిన భారత హైకమిషనర్ సంజయ్‌ కుమార్‌ వర్మతోపాటు ఇతర దౌత్యవేత్తలను కూడా ఖలిస్థానీ ఉగ్రవాది అయిన నిజ్జర్‌ హత్య కేసులు అనుమానితులుగా వారి పేర్లను చేర్చే ఆలోచన చేస్తోంది కేనడా. దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.. ఈమేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  

3 /7

ఎటువంటి ఆధారాలు లేకుండానే భారత హై కమిషనర్‌ను ఖలిస్థాని ఉగ్రవాది అయిన నిజ్జర్‌ హత్య కేసులో చేర్చడం సరికాదని పలుమార్లు భారత్‌ కెనడాకు స్పష్టం చేసింది.  కేవలం భారత్‌ దౌత్యవేత్తలను కెనడా లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకు కోసం కూడా ట్రూడో ప్రభుత్వం ఇలాంటి చర్యలను చేపడుతోంది.  

4 /7

అంతేకాదు కెనడా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలపాలకు సైతం మద్ధతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఆ హక్కు తమకు కూడా ఉందని ఈ వేటుకు భారత్‌ సిద్ధమైంది. ఈనేపథ్యంలో భారత్‌ ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. దీంతో కెనడా కూడా అక్కడ ఉన్న మన అధికారులను బహిష్కరించింది. 

5 /7

భారత్‌ నుంచి బహిష్కరించిన కెనడా దౌత్యవేత్తలు.. స్టూవర్ట్ రాస్‌ వీలర్‌- హై కమిషనర్‌ ప్యాట్రిక్‌ హెబర్ట్‌ -డిప్యూటీ హై కమిషనర్‌ మేరీ క్యాథరీన్‌ జొలీ- ఫస్ట్‌ సెక్రటరీ రాస్‌ డేవిడ్‌ ట్రైట్స్‌- ఫస్ట్‌ సెక్రటరీ ఆడామ్‌ జేమ్స్ చుపికా- ఫస్ట్‌ సెక్రటరీ పౌలా ఒర్జుయేలా - ఫస్ట్‌ సెక్రటరీ

6 /7

ఈ ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 11:59 వరకు (శనివారం) భారత్‌ విడిచి వెళ్లాలని సూచించింది. ఇంతలా భారత్‌ కెనడాల మధ్య బంధం క్షీణించడానికి ప్రధాన కారణం జస్టిస్‌ ట్రూడో. ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య బంధాలు దిగజారాయి.  

7 /7

ఖలిస్థానీ ఉగ్రవాదులపై 1970 సమయం నుంచే భారత్‌ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. అప్పటి వీసా విధానాలు సులభతరం కావడంతో చాలామంది భారత్‌ వ్యతిరేక ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. వారు భారత్‌పై వ్యతిరేకంగా చేస్తోన్న చర్యలకు కెనడా ప్రభుత్వం అప్పటి నుంచే వెనుకేసుకు వస్తోంది.