Raashii Khanna: చీరకట్టులో సన్నజాజి తీగలా రాశి ఖన్నా.. లేటస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..


Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. హీరోయిన్ గా  తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం ఇక్కడ సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ చూపులు చేస్తోంది. 

1 /5

రాశి ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది. అందుకే వేరే  ఇండస్ట్రీ వైపు చూస్తోంది.

2 /5

రాశి ఖన్నా.. కేవలం సినిమాలను  మాత్రమే నమ్ముకోలేదు. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

3 /5

రాశీ ఖన్నా 'ఊహాలు గుసగుసలాడే' మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్'చిత్రంతో  టాలీవుడ్  ప్రేక్షకుల మనసును దోచుకుంది.జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేక పోయింది. 

4 /5

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం రాశీ ఖన్నాకు ఛాన్సులు దక్కలేదు.

5 /5

 విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్యకు జోడిగా నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.  ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.