Traffic Light History: రోడ్డుపై రాగానే ముందుగా కన్పించేది ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ క్రమబద్ధీకరించేవి ఇవే. ఏ మాత్రం ఉల్లంఘించినా చలానా కట్టాల్సి రావడమే కాదు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్ చరిత్ర ఏంటి, ఎవరు కనిపెట్టారు. ఎప్పుడు కనిపెట్టారు, ఈ ఐడియా ఎవరిది..ఆ వివరాలు మీ కోసం..
19వ శతాబ్దం చివర్లో పారిశ్రామిక విప్లవంతో దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ జామ్ అనేది మొదలైంది.
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ట్రాఫిక్ సిగ్నల్ ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ ఐడియా ఎలా వచ్చింది ఎవరికి వచ్చింది ఎక్కడి నుంచి వెలుగులోకి వచ్చింది..
ట్రాఫిక్ లైట్‌ను తొలిసారిగా బ్రిటన్‌లో కనుగొన్నారు. లండన్‌లో 1868లో గ్యాస్‌తో నడిచే ట్రాఫిక్ లైట్ ఏర్పాటైంది.
ఆ సమయంలో ట్రాఫిక్ లైట్స్‌లో కేవలం రెండే రంగులు గ్రీన్, రెడ్ ఉండేవి. రెడ్ అంటే ఆగడం, గ్రీన్ అంటే వెళ్లడం అని అర్ధం
ఆ తరువాత 1912లో సాల్ట్ లేక్ సిటీ, యూటాలో తొలిసారి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ అభివృద్ధి జరిగింది. ఈ లైట్‌ను డెట్రాయిట్‌లో విలియమ్ పార్టస్ అనే పోలీసు అధికారి తయారు చేశాడు.
ఆ తరువాత 1920 దశకంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో మూడవ లైట్ ఎల్లో వచ్చి చేరింది. దీనర్ధం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉండమని అర్ధం
కాలానుగుణంగా ట్రాఫిక్ లైట్స్‌లో మార్పులు రావడం మొదలైంది. ఇందులో కొత్త కొత్త ఫీచర్లు రాసాగాయి. ఇటీవలి కాలంలో ట్రాఫిక్ లైట్ వ్యవస్థలో పాదచారులకు కూడా ఆప్షన్ వచ్చింది.
ఇండియాలో ట్రాఫిక్ లైట్‌ను తొలిసారిగా 20 వ శతాబ్దంలో వినియోగించారు. మొదటి సారిగా ట్రాఫిక్ లైట్‌ను 1953లో చెన్నైలోని ఎగ్మోర్ జంక్షన్‌లో వినియోగించారు.