Diwali Week Lucky Zodiac: దీపావళి ముందే లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ టైమ్‌తో పాటు విపరీతమైన డబ్బు పొందడం ఖాయం!

Diwali Week Lucky Zodiac In Telugu: ఈ ఏడాది దీపావళి  సమయంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగం బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోతోందని`జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా సంపద, శ్రేయస్సు, లాభాలు కలుగుతాయి. 
 

1 /7

అలాగే ఈ దీపావళి సమయంలో కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే వృషభ రాశి నుంచి మీన రాశివారి వరకు లక్ష్మీనారాయణం యోగం కారణంగా అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు పొందే రాశులవాలు ఏవో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకోండి.

2 /7

వృషభ రాశివారికి ఈ దీపావళి వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు భవిష్యత్‌లో రాబోయే సమస్యలను వెంటనే కనుగొని సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం అనుకూలించడం వల్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ వారం ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి.  

3 /7

అలాగే వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ వారం ప్రత్యేకమైన బోనస్‌లు పొందడమే కాకుండా మరిన్ని ఆదాయ వనరులు కూడా పొందుతారు. వీరికి ఆస్మికంగా కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి.

4 /7

అక్టోబర్‌ చివరి వారం కర్కాటక రాశివారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు ఈ రాశివారికి అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి. అలాగే ప్రతి పనిలో అఖండ విజయాలు సాధిస్తారు. ఎలాంటి పనులు చేసి సకాలంలో పూర్తవుతాయి. అలాగే వీరికి అదృష్టంతో పాటు శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది..  

5 /7

ముఖ్యంగా కాజకీయానికి సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే శుభప్రదంగా ఉంటుంది.  దీపావళి సమయంలో కర్కాటక రాశివారు ఎలాంటి కోరికలు కోరుకున్న విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా చింతిస్తున్న ఎలాంటి విషయాలైనా వారికి చాలా అనుకూలంగా మారుతాయి. 

6 /7

ఈ వారం మీన రాశివారికి కూడా చాలా బాగుంటుంది. వీరికి ఈ వారం ప్రారంభంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా నెరవేరుతాయి. అలాగే చిన్న చిన్న అడ్డంకులు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆర్థిక సంక్షోభాల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.  

7 /7

మీన రాశివారికి ఎలాంటి చిక్కులు ఉన్న ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాల్లో ఇతరులతో గొడవలు పడడం మానుకోండి. ఈ వారం డబ్బు కూడా తిరిగి పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి జీతంతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.