Flying Flea C6 Electric Bike: కుర్రాళ్లకు కిక్కిచ్చే న్యూస్.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి ఈవీ బైక్!

Royal Enfield Flying Flying Flea C6 Electric Bike: ఇటలీలోని మిలన్ నగరంలో జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్ షో EICMA 2024లో తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీని పరిచయం చేయడంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ C6ని  మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫ్లయింగ్ ఫ్లీ C6 లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 

1 /7

Flying Flea C6 Electric Bike: దేశంలో విద్యుత్ ద్విచక్ర వెహికల్స్ ఆదరణ ఘణనీయంగా పెరుగుతోంది. ప్రతి ఏటా విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఈ విభాగంలో బైక్స్ ను లాంచ్ చేశాయి. తాజాగా ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఎలక్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. బైక్ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్ ను తాజాగా మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ 6 పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది.   

2 /7

 బైక్ లవర్స్ చాలా కాలంగా  రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చే  ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురుచూస్తున్నారు. మిలన్‌లో ICMA 2024 ప్రారంభంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఫ్లయింగ్ ఫ్లీ C6ని చూశారు. ఈ బైక్ రెట్రో లుక్, ఆధునిక ఫీచర్ల కాంబోగా వస్తుంది. ఈ బైక్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. బైక్ లవర్స్ దీన్ని చూస్తే కొనుగోలు చేసి తీరాల్సిందే అన్నంత అందంగా ఈ బైక్ ను డిజైన్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను స్పెయిన్‌లోని బార్సిలోనా వీధుల్లో నడుపుతూ కనిపించారు.

3 /7

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్  ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లుక్, ఫీచర్ల తెలసుకుందాం. ఈ బైక్ మిగతా బైకులకంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది రెట్రో లుక్‌తో రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇందులో LED లైట్లు ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్స్, టైర్ హగ్గర్స్,టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి.  

4 /7

ఫ్లయింగ్ ఫ్లీ C6 ఫ్రంట్ సైడ్ ప్రత్యేకమైన గిర్డర్ ఫోర్క్ సస్పెన్షన్ సిస్టమ్  బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అంతేకాదు అల్లాయ్ వీల్స్, సింగిల్ సీటుతో పాటు, స్ప్లిట్ సీట్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చారు.   

5 /7

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఫీచర్లు చూస్తే .. ఇది గుండ్రని ఆకారపు టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేతో పాటు ఇన్-హౌస్ బిల్డ్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. వీటిని గాలిలో అప్‌డేట్ చేయవచ్చు. ఇవే కాదు కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ కంట్రోల్ యూనిట్‌లో 2000 కంటే ఎక్కువ రైడ్ మోడ్ కాంబినేషన్‌తో సహా అనేక ఇతర ఫీచర్లు ఈ బైకులో ఉన్నాయి.  

6 /7

 ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నడపడం చాలా సులభం అని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. రాబోయే కాలంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ సబ్-బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ తరువాతి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ S6 కూడా ప్రారంభించనుంది.  ఇది స్క్రాంబ్లర్ విభాగంలో ఉంటుంది.   

7 /7

అయితే ఈ బైక్ ధర ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాల్నింటిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2026లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం.