Delhi Air Pollution: డెంజర్ జోన్‌లో ఢిల్లీ.. రంగంలోకి దిగిన సీఎం అతిషీ.. గ్రాప్-3 ప్లాన్ అమలుపై కీలక ఆదేశాలు..

Atishi On Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయినట్లు తెలుస్తొంది. దీంతో జనాలు గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  సీఎం అతిశీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.

1 /6

దేశ రాజధాని ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఈ క్రమంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా సీఎం అతిషి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా.. బైటకు వస్తే తప్పకుండా మాస్క్ లు ధరించాలని కూడా సూచించినట్లు సమాచారం.  

2 /6

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఢిల్లీలో వాయు నాణ్యత కొన్నిరోజుల్లగా భారీగా పడిపోయినట్లు తెలుస్తొంది. గతంలో ఇలానే వాయుకాలుష్యం ఏర్పడినప్పుడు సరి, బేసీ విధానంను అమలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యంతో అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టవద్దని కూడా అతిషీ ఆదేశించినట్లు తెలుస్తొంది.  

3 /6

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498 కు చేరుకుందని తెలుస్తొంది.  అదే పాక్ లోని.. లాహోర్ లో ఎయిర్ క్వాలిటీ.. 770 గా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సమీపంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో భారీగా పంట వ్యర్థాలను తగల బెడుతున్నట్లు తెలుస్తొంది.  

4 /6

దీని వల్ల పొగలు ఢిల్లీకి వస్తున్నట్లు తెలుస్తొంది. ప్రతి ఏడాది పంట వ్యర్థాలు ఇలా తగల బెట్టడం వల్ల వాయుకాలుష్యంతో ఢిల్లీ ప్రజలు మాత్రం వణికిపోతున్నారు. మరోవైపు ఇప్పటికే ఐదో తరగతి వరకు స్టూడెంట్స్ కు.. ఆన్ లైన్ లలోనే తరగతులు నిర్వహించాలని కూడా సీఎం అతిషీ ఆదేశించినట్లు తెలుస్తొంది.  

5 /6

ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు నాణ్యత.. పాలమ్, సఫ్దార్ జంగ్ 500 ఎం, 400 ఎం విజిబిలిటీ ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ప్రస్తుతం 498 వరకు చేరుకుందని తెలుస్తొంది. ఇది అత్యంత రిస్కీజోన్ అని దీని వల్ల శ్వాస కోశ సంబంధ వ్యాధులు వస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు.  

6 /6

మరోవైపు ఢిల్లీలో వాహానాల రాక పోకలకు బాగా ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తొంది. అక్కడ ఒక వైపు చలిగాలులు, మరోవైపు వాయు కాలుష్యంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  దీని వల్ల విమానాలు, రైళ్లు కూడా వేళల్లో కూడా జాప్యం జరుగుతుందని సమాచారం.  ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-III’ని అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా.. ఇక మీదట నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తొంది..