Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?

Saturday bank holiday: నవంబర్‌ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్‌ 15 గురునానక్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. అయితే, మరుసటి రోజు నవంబర్‌ 16వ తేదీ శనివారం కాబట్టి ఈరోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

నవంబర్‌ నెలలో ఉత్తరాదిలో ఎక్కువ శాతం బ్యాంకులు సెలవులు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్‌ 1వ తేదీ నుంచి వరుసగా సెలవులు ఉన్నాయి. అయితే, నవంబర్‌ 15వ తేదీ గురునానక్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.  

2 /7

అయితే, మరుసటి రోజు శనివారం నవంబర్‌ 16వ తేదీ రోజు బ్యాంకులు పనిచేస్తాయా? ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయా? రేపు శనివారం 16వ తేదీ మూడో శనివారం కాబట్టి ఆరోజు బ్యాంకులు పనిచేస్తాయి. ఏ బంద్‌ లేదు.  

3 /7

నవంబర్‌ 18 సోమవారం కర్నాటకలో బ్యాంకులు సెలవు ఎందుకంటే ఈరోజు కనకదాస్ జయంతి సందర్భంగా ఆ  రాష్ట్రంలోని అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులు బంద్‌ ఉంటాయి.  

4 /7

ఇక నవంబర్‌ 23వ తేదీ నాలుగో శనివారం కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు. అంతేకాదు మేఘాలయాలో సెంగ్‌ కుట్సెనమ్‌ సందర్భంగా బంద్‌ ఉంటాయి. ఆర్‌బీఐ ప్రకారం మూడు కేటగిరీల్లో బ్యాంకుల బంద్‌ పాటిస్తాయి.  

5 /7

రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా బ్యాంకు అలెర్ట్‌ పొందవచ్చు. అంతేకాదు బ్యాంకులు బంద్‌ ఉన్న సమయంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.  

6 /7

అయితే, ఏ ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలు నిర్వహించినా పబ్లిక్‌ వైఫై ఉపయోగించకూడదు. తరచూ మీ పాస్వర్డ్‌ మారుస్తూ ఉండండి. పిన్‌ కూడా మారుస్తూ ఉండండి.   

7 /7

ఒకవేళ మీరు ఏటీఎం పొగొట్టుకుంటే ఏటీఎం కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌, ప్రీపెయిడ్‌ కార్డు వెంటనే బ్లాక్‌ చేయండి. బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్‌ యాప్స్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్‌ నిర్వహించవచ్చు.