Mehndi Colour: గోరింటాకు ఎర్రగా పండట్లేదా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కుంకుమ పువ్వులా ఎర్రగా మారుతుంది..

Mehindi Designs: చాలా మంది తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. కానీ కొంత మంది చేతులకు మాత్రమే గోరింటాకు ఎర్రగా పండుతుంది. మరికొందరికి మాత్రం అంత ఎర్రగా పండదు. ఈ క్రమంలో కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం గోరింటాకు  ఎర్రగా మారుతుంది.

1 /5

గొరింటాకు అమ్మాయిలకు ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. బర్త్ డే, పండగలు, శుభకార్యాలు ఇలా ఏది వచ్చిన కూడా తమ చేతులకు వయస్సుతో సంబంధం లేకుండా గొరింటాకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

2 /5

కొందరిలో గోరింటాకు ఎర్రగా పండుతుంటే.. మరికొందరిలో మాత్రం.. అంత పండదు. ఈ నేపథ్యంలో.. దీంతో వాళ్లు తెగ బెంగ పెట్టుకుంటారు. తమచేతికి గోరింటాకు పండలేదని రచ్చ చేస్తుంటారు.

3 /5

ఈ  క్రమంలో చేతికి గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మెహెందీ ఎర్రగా అవుతుందంట. చేతికి మెయిందీ పెట్టుకున్న తర్వాత.. ఒక గిన్నెలో చక్కెర తీసుకొవాలి. దానిలో నీళ్లు పోసి పదినిముషాలు  ఉంచాలి.  

4 /5

ఆ తర్వాత ఒక దూదితో.. మన చేతికి ఉన్న మెయిందీకి ఈ చక్కెర నీళ్లను రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత కొన్ని గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత కడుక్కుంటే చేతికున్న గోరింటాకు ఎర్రగా మారుతుంది.  

5 /5

మరో విషయం ఏంటంటే.. నిమ్మకాయను తీసుకుని దాని రసం ఒక గిన్నెలో తీసుకొవాలి. ఈ రసంను కూడా.. మెయిందీకి పెట్టుకున్న కూడా.. అలానే.. మెయిందీ ఎర్రగా మారుతుందంట. అచ్చం కుంకుమ పువ్వులా ఎర్రగా మారుతుందంట.