Hyderabad Weather Update: చలి పంజా.. హైదరాబాద్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఈ జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్న వాతావరణ శాఖ..

Hyderabad Weather Update: చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరుగుతోంది.  తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

1 /8

Telangana Weather Update: వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చలి పెరిగింది.   

2 /8

వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని చెబుతోంది. లేదంటే జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతోంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్‌ జబ్బులు చుట్టుముడతాయని హచ్చరిస్తోంది.   

3 /8

మొన్నటి వరకు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇప్పుడు చలితీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడటం తప్పేలా లేదు. ముఖ్యంగా ఏపీలో మరో అల్పపీడన ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంది.  

4 /8

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో చలి పెరిగింది. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది.   

5 /8

తెలంగాణలో ముఖ్యంగా మెదక్‌ జిల్లాలో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా 12 డిగ్రీలు నమోదు అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది.  

6 /8

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన ఇబ్రహీం పట్నం, మహేశ్వరంలో తీవ్రంగా చలి పెరిగింది 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక ఆదిలాబాద్‌లో కూడా చలి తీవ్రత పెరిగింది.   

7 /8

వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్‌ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

8 /8

ఈ సందర్భంగా ప్రజలు వేడి ఆహారం, బాగా ఉడికించి తినాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలిలో బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వేటర్లు, మఫ్లార్‌తో కాళ్లు, చేతులు కవర్‌ చేసుకోవాలి. లేకపోతే జబ్బులు చుట్టుముడతాయి.