Akhil Wedding Announcement: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందని సడన్గా సోషల్ మీడియాలో ఇటీవలె అక్కినేని నాగార్జున పోస్ట్ చేసి షాకింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా చాలామంది నాగచైతన్య శోభిత, అఖిల్ జైనబ్ల వివాహం ఒకేరోజు ఉండచ్చని ప్రచారం చేశారు. దీనిపై హీరో నాగార్జున స్పందించారు.
అక్కినేని అఖిల్ జైనబ్ల ఎంగజ్మెంట్ 26వ తేదీ జరిగన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవలె హీరో నాగార్జున అధికారికంగా ప్రకటించి సడన్ షాక్ ఇచ్చారు.
మరోవైపు నాగచైతన్య శోభితల వివాహం కూడా డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరగనుంది. అయితే, ఈ రెండు జంటల పెళ్లి ఒకేరోజు జరగనుందని పెద్ద ఎత్తుగా ప్రచారం జరిగింది.
దీనిపై నాగార్జున స్పందించారు. అఖిల్ విషయంలో చాలా ఆనందంగా ఉంది, జైనబ్ చాలా మంచి అమ్మాయి వాళ్లు పెళ్లి చేసుకోవడం మంచి విషయం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతేకాదు ఈ ఏడాది తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైంది, ఇద్దరు తనయుల కొత్త అధ్యయనంతోపాటు నాన్నగారి శత జయంతి ఉత్సవాలు కూడా జరిగాయి అని హీరో నాగార్జున అన్నారు.
హీరో నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4 న జరగనుంది. ఇదిలా ఉండగా నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థాలతో విడపోయారు. ఆ తర్వాత శోభితతో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
మరోవైపు హిరోయిన్ సమంత 'సిటాడెల్- హనీ బన్నీ' ఇటీవల హిందీ వెబ్ సిరీస్లో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పెళ్లి గురించిన కొన్ని విషయాలను సమంత పంచుకున్న విషయం తెలిసిందే...