Sankalp Diwas: ప్రముఖ నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సన్మానం..

Sankalp Diwas: ప్యాన్ ఇండియా నటుడు సోనూ సూద్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కరోనా టైమ్ లో బడా బడా హీరోలు చేయలేని తనదైన సేవా కార్యక్రమాలతో మంచి మనసుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా ఈయన చేసిన సేవలకు గుర్తించిన ప్రముఖ సంస్థ సుచిరిండియా సోనూసూద్ ను ‘సంకల్ప దివాస్’ అవార్డుతో సత్కరించింది.

1 /6

Sankalp Diwas: సోనూ సూద్ చేసిన సేవలను గుర్తించి ప్రముఖ సంస్థలు ఆయన్ని సన్మానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన బర్త్ డే పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ నవంబర్ 28న సంకల్ప దివాస్ ను నిర్వహిస్తూ వస్తున్నారు.

2 /6

ఈయన సమాజ సేవ చేయడంతో పాటు.. సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని  సత్కరిస్తూ వస్తున్నాడు.గత ఇరవై యేళ్లుగా ప్రతి ఏడాది గొప్ప వాళ్లను సత్కరిస్తూ వస్తున్నాడు.  వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు.

3 /6

ఈ యేడాది 'సంకల్ప్ దివాస్'లో ప్రముఖ నటుడు సోనూసూద్ ను 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో గౌరవించారు.  ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.   ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ వై. కిరణ్ మాట్లాడుతూ.. సోనూ సూద్ ను సత్కరించడం కోసమే.. బల్గేరియా అంబాసిడర్ నికోలాయ్ యాంకోవ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారన్నారు.  అలాగే నా స్నేహితుడు, మన ఫ్యామిలీ సభ్యుడిలా భావించే వ్యక్తి, సినిమాల్లో విలన్ గా నటిస్తూ  నిజ జీవితంలో అసలు సిసలు కథానాయకుడుగా నిలిచారు సోనూసూద్.    

4 /6

అలాంటి గొప్ప వ్యక్తి  సోనూ సూద్ ని సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రతి ఏడాది ఆనవాయితీగా సంకల్ప్ దివాస్ ని నిర్వహిస్తూ వస్తున్నవిషయాన్ని ప్రస్తావించారు. నా పుట్టినరోజు వేడుకను అర్థవంతంగా, సమాజానికి ఉపయోగపడేలా, కొందరి జీవితాల్లోనైనా వెలుగులు నింపేలా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంకల్ప్ దివాస్ కి శ్రీకారం చుట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంకల్ప్ దివాస్ లో ఇప్పుడు రెండు గ్రామాలు, 50 పాఠశాలలు భాగమైన విషయాన్ని ప్రస్తావించారు.  నేను కేవలం 2000 రూపాయిలతో నా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడి ఆశీస్సులు, నా తల్లిదండ్రులు నేర్పిన కృషి, పట్టుదలతోనే ఈ రోజు ఎంతో మందికి సేవ చేసే కార్యక్రమం దక్కిందన్నారు.

5 /6

సోనూసూద్ మాట్లాడుతూ.. ఈ  పురస్కారం పొందటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సోదరుడు కిరణ్  చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసే గొప్ప సేవా కార్యక్రమాల గురించి తరచూ వింటుంటాను. అలాంటి వ్యక్తితో వేదికను పంచుకోవడం  గొప్పగా ఉందన్నారు. నేను కిరణ్ ని కలవకముందే, ఆయన గొప్పతనం గురించి ఎంతో విన్నాను. ఈ ప్రత్యేక పిల్లలు రియల్ హీరోలు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకంగా ఉందన్నారు.

6 /6

ముఖ్య అతిథి హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ మాట్లాడుతూ.. ఈ  కార్యక్రమానికి హాజరు కావడం తనకు ఎంతో హ్యాపీగా ఉందన్నారు. కిరణ్  లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.