UAN Activation : ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ కు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన గడువును మరో 15రోజులపాటు పొడిగించింది. ఇంతకు ముందు గడువు నవంబర్ 30తో ముగియగా..తాజాగా డిసెంబర్ 15వరకు పొగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
EPFO UAN Activation : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు అకౌంట్ తో ఆధార్ సీడింగ్ కు సంబంధించి గడువును ఈనెల ( డిసెంబర్ ) 15వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారికి యూఏఎన్ యాక్టివ్ గా ఉంచుకోవాలని కేంద్రం కోరింది. అలాగే ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇనెన్సింటివ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యూఏఎన్ యాక్టివ్‌లో ఉంచాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈఎల్ఐ అంటే ఏమిటి..దాని ప్రయోజనాలేంటో చూద్దాం.
ఈఎల్ఐ స్కీమును కేంద్ర బడ్జెట్ 2023-24లో తీసుకువచ్చింది. ఈఎల్ఐ అంటే ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ స్కీము ద్వారా ఉద్యోగులు ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కు డైరెక్టుగా డబ్బు ట్రాన్స్ ఫర్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఇటీవలి బడ్జెట్ లో మూడు ఈఎల్ఐ స్కీములను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కీం Aలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాలను ఆధారంగా గుర్తించి..వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. రూ. 15వేల వరకు మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. దీనికి గరిష్టంగా నెలకు రూ. లక్షల లోపు జీతం ఉన్న ఉద్యోగులే అర్హులు.
అలాగే స్కీం Bలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. దీనిలో భాగంగా మొదటిసారి ఉద్యోగాల్లో చేరినట్లయితే వారి యజమానులకు కూడా మొదటి నాలుగేళ్లపాటు నిర్ధరిత వేతన స్కేళ్లలో ఈపీఎఫ్ లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది 24శాతం వేతనం, మూడో ఏడాది 16శాతం, నాలుగో ఏడాది 8శాతం వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు.
ఇక స్కీమ్ C ని ఎక్కువగా కంపెనీలను పరిగణలోనికి తీసుకుని రూపొందించారు. అన్ని రకాల సెక్టార్లలో ఉద్యోగాల కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకరాన్ని అందిస్తుంది. రెండేళ్లవరకు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి నెలకు 3వేల రూపాయిలు లిమిట్ చేశారు.
ఈఎల్ఐ స్కీం బెనిఫిట్స్ పొందాలంటే ఈపీఎఫ్ఓ చందాదారలుు తమ యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా కచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ఏర్పాటు కాలేదంటూ చెప్పుకొచ్చారు.