Mars Retrograde Effect: జ్యోతిష్య శాస్త్రం నవగ్రహాలపై ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు సంచారం చేస్తేనే వ్యక్తుల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నక్షత్రాలు కూడా సంచారం చేస్తాయి.
గ్రహాలు సంచారం చేసినప్పుడే వ్యక్తిగత జీవితాల్లో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే తిరోగమనం చేసినప్పుడు కూడా ఇలాంటి మార్పులే వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ తిరోగమన ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంగారక గ్రహం తీరోగమనం చేయబోతోంది. ఈ తిరోగమన ప్రభావం కొన్ని రాశుల వృత్తి వ్యాపారాల జీవితాలపై చూపబోతోంది. అలాగే కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కుజుడితి రోగమనం డిసెంబర్ 7వ తేదీన జరగబోతోంది. అయితే కుజుడు కర్కాటక రాశిలో ఉదయం ఐదు గంటలకు రివర్స్‌లో తిరగబోతున్నాడు. ఇలా కుజుడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఇలానే తిరోగమన దశలో ఉంటాడు.
కుజుడు తిరోగమనం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేస్తారు.
కన్యా రాశి వారు కూడా అంగారకుడి తిరోగమనం కారణంగా వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికను కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే వృద్ధి వ్యాపార జీవితాల్లో కూడా విపరీతమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
మీన రాశి వారికి కూడా కుజుడు తిరోగమన ప్రభావం వల్ల జీవితం సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. అలాగే భౌతిక ఆనందాన్ని పొందడమే కాకుండా ఆరోగ్యవంతంగా జీవిస్తారు.