Keerthy Suresh: కీర్తి సురేష్ క్రిస్టియన్ స్టైల్ పెళ్లి.. ఫోటోలు చూశారా..?

Keerthy Suresh wedding 

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని.. స్థానం తెచ్చుకునింది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ ని హిందూ పద్ధతిలో.. వివాహం చేసుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు మరోసారి క్రిస్టియన్ స్టైల్ లో పెళ్లి చేసుకుంది

.

  • Dec 15, 2024, 18:34 PM IST
1 /5

కీర్తి సురేష్ ఈ మధ్యనే తన హై స్కూల్.. ఫ్రెండ్ ఆంటోనీని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 15 సంవత్సరాల వీరి స్నేహబంధం.. ఇప్పుడు పెళ్లితో ముడిపడింది.

2 /5

కాగా కీర్తి సురేష్ హిందువు అయినందువలన.. ముందుగా వీరిద్దరి వివాహం. హిందూ సాంప్రదాయ పద్ధతిలో.. ఎంతో ఘనంగా జరిపారు ఇరువురు కుటుంబ సభ్యులు.

3 /5

అయితే కీర్తి సురేష్ భర్త ఆంటోనీ.. క్రిస్టియన్ కావడంతో.. ఇప్పుడు మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. ఇక ఎందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

4 /5

కాగా నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. మహానటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత ఈమెకు వరుస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.

5 /5

కానీ ఈ మధ్యనే.. మళ్లీ దసరా సినిమాతో మంచి విజయం సాధించింది ఈ అమ్మాడి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. మరి పెళ్లయిన తర్వాత కీర్తి సురేష్ ఎలాంటి సినిమాలు ఎంచుకుంటుందో వేచి చూడాలి.