దేశ రాజధాని అట్టుడికిపోతోంది. యుద్ధ వాతావరణం నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఢిల్లీలోని భజన్ పురా, ఖాజురీఖాస్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు పెట్రోలు బంకులు, దుకాణాలు, కార్లు, ఇళ్లు, ఆటోలు.. ఇలా ఏది దొరికితే వాటిని తగులబెట్టారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు ఢిల్లీలో అంతటి ఘోరం జరుగుతుంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఏం చేస్తున్నారని ఎంఐఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
ఢిల్లీలో హింసాత్మక దృశ్యాలు