Snakes Not Seen In Winter: పాము బుస్సుమంటేనే ఆమడ దూరం పారిపోతాం. వెనక్కి తిరిగి చూడకుండా కిలోమీటరు పరుగెత్తుతాం. ఎందుకంటే పాములు విషపూరిత జంతువుల్లో ఒకటి. కరిస్తే ప్రాణాలు హరి. చెట్లు పుట్టలు, పొదలు, ఇల్లు అనే సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో ట్రైన్ లో కూడా పాముల దర్శనం ఇస్తున్నాయి. అయితే చలికాలం పాములు ఎందుకు కనిపించవు ఆ రహస్యం మీకు తెలుసా?
చలికాలం పాములు ఎక్కువగా కనిపించవు. ఈ విషయం మీకు తెలుసా? మరి ఎక్కడికి వెళతాయి? ఏంచేస్తాయి? చలికాలంలో పాములు ఎక్కువగా నిద్రకు పోతాయి. తిరిగి ఎండాకాలంలో వేటడానికి వాటికి తగిన శక్తి ఈ సీజన్లోనే దొరుకుతుంది. అందుకే అవి బాగా నిద్రపోతాయి.
ముందుగానే వాటి శరీరంలో నిల్వ చేసిన కొవ్వులను కూడా ఈ సమయంలో ఉపయోగించుకుంటాయి. దీంతో వాటికి ఆకలి వేయదు. బయటకు వేటాడటానికి రావాల్సిన పనిలేదు. అందుకే ఈ సమయంలో వేటకు కూడా వెళ్లవు.
చలికాలంలో అవి బయటకు కనిపించకుండా దాక్కుంటాయి. వాటి శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. వర్షాకాలంలో అడవుల్లో నుంచి సైతం బయటకు వచ్చే పాములు చలికాలంలో మాత్రం చెట్లు, పుట్టలో దాక్కుంటాయి. ఈ సమయంలో వాటికి కావలసిన శక్తి కూడా పెంచుకుంటాయట .
అయితే, అడవుల్లో కూడా ఎక్కువగా ఉండవు. ఎందుకంటే అడవుల్లో కూడా చలి ఎక్కువగా ఉంటుంది.. వేటాడే జంతువులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి రాళ్ల మధ్యలోపలికి వెళ్లిపోతాయి. అక్కడే వాటి ప్రాణానికి కూడా ఏ హాని ఉండదు.
ముఖ్యంగా ఈ చలికాలంలో వాటి కార్యకలాపాలు మందగిస్తాయి. అందుకే అవి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోతాయి. అక్కడ నిద్రా స్థితిలో గాఢ నిద్రలోకి వెళ్తాయి. అప్పుడప్పుడు సూర్యరశ్మి కోసం బయటికి వస్తూ వెళ్తూ ఉంటాయి.
ముఖ్యంగా భూమి లోపల, రాళ్ల కింద, చెట్లు ఉండే పగుళ్ల మధ్యలో లోపటికి వెళ్లి నిద్రాణ స్థితికి వెళ్ళిపోతాయి. అక్కడ చలి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి నిద్రపోవడానికి అనువైన స్థలం.
చలికాలంలో కనిపించక పోకుండా పోయే పాములు మళ్ళీ వేసవికాలం సమయం నాటికి ఎక్కువ శక్తితో పుంజుకుంటాయి వేటకు బయలుదేరుతాయి. చలికాలం మాత్రం కాస్త విరామం తీసుకుంటాయి. ఒక విధంగా ఇవి కూడా వేటకు బ్రేక్ తీసుకుంటాయి.