Rajdoot 350 Price: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా Rajdoot 350 బైక్‌.. ఫీచర్స్‌ సేమ్‌.. ధర చీప్‌!

Rajdoot 350 Price On Road:  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మార్కెట్‌లోకి Rajdoot 350 మోటర్‌ సైకిల్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Rajdoot 350 Price On Road: ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అద్భుతమైన డిజైన్స్‌తో మోటర్‌ సైకిల్స్‌ను విడుదల చేస్తూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే మార్కెట్‌లో అన్ని మోటర్‌ సైకిల్స్‌ కంపెనీలు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తరహాలో క్లాసిక్ లుక్‌లో కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే రాజ్‌దూత్ 350 మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతోంది.

1 /6

గతంలో రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్‌ అద్భుతమైన లుక్‌లో కొత్త కొత్త మోటర్‌ సైకిల్స్‌ విడుదల చేసింది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మార్కెట్‌లోకి రావడంతో మార్కెట్‌లో దీని క్రేజ్‌ తగ్గిపోయింది. అయితే రాజ్‌దూత్ కంపెనీ మరోసారి మార్కెట్‌లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో మరోసారి రాజ్‌దూత్ 350 మోటర్‌ సైకిల్‌ను విడుదల చేయబోతోంది.  

2 /6

కొత్త రాజ్‌దూత్ 350 మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది సరికొత్త సాంకేతికతతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్లాసిక్‌ లుక్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకమైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో పాటు కొన్ని స్పెషల్ ప్రత్యేకమైన ఫీచర్స్‌ కూడా ఉంటాయి.  

3 /6

ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌ సైకిల్‌లో లాంగ్ డ్రైవింగ్‌ చేసే సమయంలో మొబైల్ ఛార్జింగ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన పోర్ట్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

4 /6

ఇక కంపెనీ ఈ మోటర్‌సైకిల్‌లో ట్యూబ్‌లెస్ టైర్లతో పాటు మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఇంజన్‌తో ఈ బైక్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కి సంబంధించిన ఇంజన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది శక్తివంతమైన 349.86 సిసి ఇంజన్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం.  

5 /6

అలాగే ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌ సైకిల్‌లో డబుల్-ఛానల్ ABS సపోర్ట్‌తో పాటు ఫైవ్‌ స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మోటర్‌సైకిల్‌ లీటర్‌కి దాదాపు 35 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన హైస్పీడ్‌ ఆప్షన్‌ కూడా లభిస్తోంది.  

6 /6

ఇక ఈ కొత్త రాజ్‌దూత్ 350 బైక్‌ ధర వివరాల్లోకి వెళితే.. ఇది ధర రూ. 1.95 లక్షలతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెళ్లడించింది. అయితే ఈ మోటర్‌ సైకిల్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.