Game Changer release date:మెగా ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో జనవరి 10న సంక్రాంతి బరిలో దిగనుంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ బాలీవుడ్ క్రిటిక్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.
గతేడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఇప్పుడు విడుదల కి సిద్ధం అవుతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు కూడా సినిమా మీద మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.
తాజాగా బాలీవుడ్ క్రిటిక్ గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ అని ఒక షాకింగ్ వేశారు. "ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ: సినిమా బాగాలేదు. ఇప్పటిదాకా శంకర్ రామ్ చరణ్ కెరియర్లలో వీకెస్ట్ సినిమా ఇది. లీడ్ యాక్టర్ల నటన కూడా ఏమాత్రం బాగాలేదు. అవుట్ డేటెడ్ బోరింగ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సారీ రామ్ చరణ్ ఫాన్స్ ఈ సినిమా ఒక పెద్ద టార్చర్" అని ట్విట్ చేశారు ఉమైర్.
అయితే ఉమైర్ సందు గురించి తెలిసిన చాలా మంది మాత్రం ఈ ట్వీట్‌ని పెద్దగా పాటించుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఏదైనా పెద్ద సినిమా విడుదలవుతున్న సమయంలో ఇలాంటి ట్వీట్లు వేయడం అతనికి అలవాటే అని.. ఈ మధ్యనే వచ్చిన పుష్ప 2 సినిమా విషయంలో కూడా.. సినిమా చాలా యావరేజ్ అని ట్విట్ చేసి.. విడుదల అయ్యి హిట్ అయ్యాక ట్వీట్ డెలిట్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కొందరు ఫాన్స్ అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. రామ్ చరణ్ కంటే శంకర్ కి ఈ సినిమా హిట్ అవడం చాలా కీలకంగా ఉంటుంది. మరి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.