Karthika Deepam 2 Today January 7 Episode: ఈ టిఫిన్లు మనింటి నుంచి తెచ్చినవి కాదు కార్తీక్ టిఫిన్ సెంటర్‌ను తెచ్చా అంటుంది సుమిత్ర. అసలు నువ్వేందుకు వెళ్లావు అమ్మ అంటాడు. శివన్నారాయణ. ఆ మనిషి నాకు నచ్చదు టిఫిన్స్ ఎలా తింటా అని చేయి కడుక్కుని వెళ్లిపోతాడు. నువ్వు కావాలనే చేశావు అంటుంది పారు. దశరథ కూడా నువ్వు అలా చేసి ఉండకూడుద అంటాడు. థ్యాంక్యూ జ్యోత్స్న దీపకు రెస్టారెంట్ రేటింగ్ ఇచ్చావు అని చెప్పి వెళ్లిపోతుంది సుమిత్ర.
మార్నింగ్ గ్రానీ కొడుకు వచ్చాడు మమ్మిలో ఏదో మార్పు కనిపిస్తుంది. దీనికి కారణం దీపేనా అని ఆలోచిస్తుంది జో. మరోవైపు కార్తీక్, దీపలు రాత్రి పడుకుని ఆలోచిస్తుంటారు. ఏంటి దీప నాతో ఏమైనా మాట్లాడాలా ? అంటాడు మార్నింగ్ సుమిత్రమ్మ వచ్చారు కదా అంటుంది దీప. ఎప్పుడూ లేనిది ఎందుకు వచ్చారు? అంటుంది. ఎవరికీ ముఖం చూపించలేక ఆటో డ్రైవర్‌తో టిఫిన్స్ తెప్పించుకుంది. మా అమ్మ అత్త మంచి ఫ్రెండ్స్ అందుకు ఎవరికీ తెలియకుండా వచ్చింది.
సొంత మనుషుల వద్ద దూరాలు ఎలా పెరిగాయో అని ఏడుస్తుంది దీప. ఇది శాశ్వతం కాదు దీప త్వరలో కోపాలు, దూరాలు అలానే మాయమవుతాయి. కాకపోతే కాస్త ఓపికపట్టాలి అంటాడు కార్తీక్. ఏమీ ఆలోచించకుండా పడుకో అంటాడు.సుమిత్రమ్మ దొంగచాటుగా చూడాల్సిన దుస్థితి ఏంటి? మీరంతా కలిసి పోవాలి నాకు అది చాలు అనుకుంటుంది దీప. తెల్లవారుతుంది టిఫిన్ బండీ వద్ద కాంచన రాగానే మిమ్మల్ని ఇక్కడికి రావద్దు అని చెప్పా కదమ్మా అంటుంది కాంచనను దీప. ఖాళీగా కూర్చోలేక వచ్చా అంటుంది.
ఒంటరిగా ఉంటే అమ్మకు కూడా ఇబ్బందే కదా అంటాడు కార్తీక్. కారు వచ్చి ఆగుతుంది. సార్ కంప్లైంట్ వచ్చిన టిఫిన్ సెంటర్ అదే అని ఫుడ్ ఇన్‌స్పెక్టర్స్ వస్తారు. మీ టిఫిన్ సెంటర్‌లో క్వాలిటీ లేని ఫుడ్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది అంటారు.
ఎవరు చెప్పారు? అంటుంది దీప. మేము చెక్ చేసిన తర్వాత తినండి. నాణ్యత లేని పదార్థాలు వాడుతున్నారని తెలిస్తే మీ టిఫిన్ సెంటర్‌ను సీజ్ చేస్తాం. మీ మీద యాక్షన్ తీసుకుంటాం అంటాడు. చూడండి అన్ని శుభ్రతలు, జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటుంది దీప. అన్ని చెక్ చేసే వరకు తినకండి. ఎవరు చేశారు కంప్లైంట్ అంటాడు కార్తీక్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అంటాడు ఇన్‌స్పెక్టర్. ఆఫీసర్స్ బండి సీజ్ చేయండి శాంపిల్ తీసుకోండి అంటారు.
సార్ అన్ని చెక్ చేసుకోండి కానీ, బండీ సీజ్ చేయకండి. అలాగే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు వారు ఇక్కడకు రావాల్సిందే అంటుంది దీప. అవన్ని మాకు చెప్పకర్లేదు. మమ్మల్ని అడ్డుకుంటే యాక్షన్ తీసుకుంటాం అంటాడు అప్పుడే జ్యోత్స్న కూడా చాటు నుంచి చూస్తుంది.కార్తీక్ బాబు మీరైనా చెప్పండి చూస్తే ఫర్వాలేదు, సీజ్ చేయవద్దని చెప్పండి అంటుంది. అప్పుడే ఓ పెద్దాయన అమ్మ దీప ఓ ప్లేట్ బజ్జీ ఇవ్వమ్మ అంటాడు. బాబాయ్ ఇక టిఫిన్స్ ఆగిపోయినట్లే ఈయన బండి సీజ్ చేస్తా అంటున్నాడు అని బాధపడుతుంది దీప.
ఏంటి మిస్టర్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వీళ్లు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడే తింటున్నా.. నేను నమ్మకంతో చెబుతున్నా కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అంటాడు.నీకేందుకు చెప్పాలి అంటాడు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు చెబుతారా? నేను మాజీ కలెక్టర్‌ను అంటాడు. ఎవరు ఇచ్చారో చెబుతారా మీ సూపీరియర్‌కు కాల్ చేయాలా? అంటాడు.
సారీ సార్ పెద్దాయన చెప్పాడు కదా.. మీ మాట మీద నమ్మకంతో మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం అని ఫడ్ ఇన్‌స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. థ్యాంక్స్ సార్ మీరే కాపాడారు అంటుంది దీప. ఇలాంటి వారు వస్తుంటారు పోతుంటారు మీరు హ్యాపీగా చేసుకోండి బిజినెస్ అంటాడు.మీరు కూర్చొండి సార్ అంటాడు కార్తీక్. అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చి ఉంటారు అని ఆలోచిస్తాడు. వెంటనే జో కార్ తీసుకుని వెళ్లిపోతుంటే చూస్తాడు. ఇదంతా జ్యోత్స్న పనా? అనుకుంటాడు
ఇప్పుడు నేను ఏం చేయాలి? కంప్లైంట్ ఇస్తే టిఫిన్ బండి తీసేస్తారు అనుకున్న ముసలోడికి భయపడి పారిపోయారు. దీప కంప్లీట్ జీరో అవ్వాలి కదా.. బావ నావైపు వచ్చేది. వాళ్ల ఎదుగుదలకు కారణమైన ప్రతీదాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది. అప్పుడే పీఏ వస్తాడు శాలరీలు కదా వేరే అకౌంట్ నుంచి తీసుకుని క్లీయర్ చేయండి అంటుంది. వచ్చే నెల ఇంతమందికి శాలరీలు ఇవ్వడం కుదరదు. 50 ఏళ్లు పైబడిన వారు కంపెనీ నుంచి తీసెస్తున్నాం అని వాళ్లందరికీ మెయిల్స్ పంపండి అనుకుంటుంది. అక్కడ దీప, ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ నేనేమ్మన్న జోకర్‌నా ఎంటర్‌టైన్ చేయడానికి అంటుంది జ్యోత్స్న.
మరోవైపు భోజనానికి కూర్చుంటారు కార్తీక్, శౌర్య, కాంచనలు. కొంతమంది జో ఆఫ్‌సువారు కార్తీక్ కోసం వస్తారు. నమస్తే కార్తీక్ బాబుఅంటారు. మాకు అన్యాయం జరిగింది సార్. ఏంచేయాలో తెలియక వచ్చాం అంటారు. సార్ సీఈఓ గారు ఎంప్లాయీస్‌కు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఉద్యోగాల నుంచి తీసేయమన్నారు. లిస్ట్ ప్రిపేర్ చేసుకు రమ్మన్నారు మొన్నే నాకు 50 ఏళ్లు వచ్చాయి అని జో పీఏ అంటాడు. నన్ను కూడా కంపెనీ నుంచి తీసేసారు అంటాడు.
మేము ఎక్కడకు పోవాలి? మా జీవితాలు ఏం కావాలి? అని బాధపడతారు. ఇది కంపెనీ రూల్‌కు విరుద్ధం కదా అంటాడు కార్తీక్. సీఈఓ నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అడగడానికి మీరు ఎవరు? అంటున్నారు సార్. మా కుటుంబాలు రోడ్డున పడతాయి అంటారు. ప్లీజ్ సార్ మేం చేయాలి? అని కార్తీక్ కాళ్లు పట్టుకుంటారు.
జ్యోత్స్న మేడం ఎవరు చెప్పినా వినడం లేదు అంటారు. కార్తీక్ బాబు మీరు ఆగండి అంటుంది దీప. మీరు ఏమీ కంగారు పడకండి మీరంతా ఇంటికి వెళ్లండి రేపు ఏం చేయాలి? నేను చెబుతా అంటాడు. ఇక కాంచన జ్యోత్స్న ఇలాంటి పనులు చేస్తుంది ఏంట్రా అంటుంది కాంచన.కళ్లెం లేని గుర్రం ఇలానే చేస్తుంది అని వెళ్లిపోతాడు కార్తీక్. అయ్యో, కార్తీక్ బాబు మళ్లి ఏం గొడవ చేస్తాడో అమ్మ అంటుంది దీప. అప్పుడు కాంచన దీప నాకు ఒక సాయం చేస్తావా? అంటుంది చెప్పండమ్మ అంటుంది దీప....