ఇండియా vs శ్రీలంక: కోహ్లీ‌సేన బంపర్ విక్టరీ

విధర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై కోహ్లీసేన భారీ విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో నాలుగోరోజు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. భారత్ బౌలర్ల ధాటికి శ్రీలంక రెండో ఇన్నింగ్ లో 166 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్ 239 పరుగుల తేడాతో కోహ్లీసేన భారీ విజయాన్ని నమోదు చేసింది. 

Last Updated : Nov 27, 2017, 04:52 PM IST
ఇండియా vs శ్రీలంక:  కోహ్లీ‌సేన బంపర్ విక్టరీ

నాగ్‌పూర్ : విధర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై కోహ్లీసేన భారీ విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో నాలుగోరోజు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక రెండో ఇన్నింగ్ లో 166 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్ 239 పరుగుల తేడాతో కోహ్లీసేన భారీ విజయాన్ని నమోదు చేసింది. 

రెండో టెస్టులో కోహ్లీసేన శ్రీలంకపై తొలి నుంచి ఆధిపత్యం వహిస్తూ వచ్చింది. తొలి ఇన్నింగ్‌లో శ్రీలంకను 205 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్ లో సత్తా చాటి  6 వికెట్ల నష్టానికి 610 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. కోహ్లీ (213) సత్తచాటడంతో భారీ స్కోర్ సాధ్యపడింది. కాగా తొలి ఇన్నింగ్ కోహ్లీసేన 405 పరుగల భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్ లో బరిలోకి దిగిన శ్రీలంక 166 పరుగలకే చేతులెత్తేసింది. దీంతో కోహ్లీ సేన ఖాతాలో మరో విజయం నమోదైంది. తొలి టెస్టులో వర్షం కారణంగా ఓటమి నుంచి తప్పించుకున్న శ్రీలంకను రెండో టెస్టులో కోహ్లీ సేన ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలుపు సాధించింది.

శ్రీలంకపై భారత్ అతిపెద్ద విజయం..
శ్రీలంకపై సాధించిన కోహ్లీసేన సాధించిన ఈ  విజయం భారత టెస్టు చరిత్రలో అతిపెద్ద విజయం. రాహుల్‌ ద్రవిడ్‌ సేన 2007లో బంగ్లాదేశ్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ 239 పరుగుల రికార్డును కోహ్లీసేన సమం చేసింది. కోహ్లీసేన మరొక్క పరుగు ఆదా చేసివుంటే భారత క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం సొంతం చేసుకొని ఉండేది. 

Trending News