Sri reddy letter to ys jagan: నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఏపీలో తన సారీల లేఖలతో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, హోమంత్రి అనితకు కూడా సారీలు కొరుతూ లేఖలు రాసినట్లు తెలుస్తొంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పోలీసులు సోషల్ మీడియాలో అసభ్య పొస్టులు, ట్రోలింగ్ లకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా.. ఇప్పటికే పలువురు వైసీపీకి పార్టీకి చెందిన ట్రోలర్స్ ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఏపీలో సారీల లేఖలు రాస్తు వార్తలలో నిలిచారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఇష్టమున్నట్లు చంద్రబాబును, ఆయన కొడుకు నారా లోకేష్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు బూతులు తిట్టేదంట.
అంతే కాకుండా.. జుగుప్సాకరంగాను మాట్లాడేది. ఇదిలా ఉండగా.. గతంలోనే టీడీపీ నేతలు శ్రీరెడ్డిపై పలు సందర్భాలలో కేసులు సైతం నమోదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు మాత్రం శ్రీరెడ్డిపై చర్యలు తీసుకొలేదని సమాచారం.
ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతోనే.. గతంలో సొషల్ మీడియాలో ట్రోలింగ్స్, పొస్టులు పెట్టిన వాళ్ల తాటను తీస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ, పొసాని, శ్రీరెడ్డిపై పోలీసులు కేసులను నమోదు చేసినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో శ్రీరెడ్డి మాత్రం..తను గతంలో చేసిన అసభ్యకరమైన పొస్టులు, కామెంట్లపై సీఎం చంద్రబాబు, నారాలోకేష్, పవన్ కళ్యాణ్, హోమంత్రి అనిత, నాగబాబు మొదలైన వారికి సారీ చెబుతూ లేఖలు సైతం విడుదల చేసింది.ఈ క్రమంలో శ్రీరెడ్డిపై ఇప్పటికే.. అనకాపల్లిలో, గుడివాడ , తూగోజి జిల్ల రాజమహేంద్రవరం పీఎస్ లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తన ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలున్నారని, దయచేసి పెద్దమనస్సుతో వదిలేయాలని, తన తప్పును తెలుసుకున్నానని కూడా శ్రీరెడ్డి చెప్పుకొచ్చినట్లు తెలుస్తొంది. తాజాగా, ఆమె మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన తల్లి , వైఎస్ షర్మిల కూడా సారీ చెబుతూ లేఖను విడుదల చేశారు. తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదని పార్టీ నుంచి దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా మాట్లాడనని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.