కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (RCF) సెమీ హైస్పీడ్ డబుల్ డెక్కర్ కోచ్ లను ప్రవేశపెట్టింది. ఇందులో నిమిషానికి 160 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చు.
తక్కువ సమయంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే విధంగామ ఈ కోచులను సిద్ధం చేశారు.
కొత్త డబుల్ డెక్కర్ కోచుల్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం 120 మంది కూర్చునే వెసులు బాటు కల్పించారు. పైన ఉన్న డెక్ లో మొత్తం 50 మంది, కింది భాగంలో 48 మంది, మిడిల్ డెక్ లో16 సీట్లు ఉంటాయి. సైడ్ లో 6 మంది కూర్చోవచ్చు. దాంతో పాటు మరికొంత మంది కూర్చునే వెసులుబాటు ఉంటుంది. (Image Source: Twitter/@KapurthalaRcf)
ఆధునిక ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా అద్భుతమైన ఇంటీరియర్, ఓవర్ హెడ్ లగేజ్ ర్యాక్, మొబైల్, ల్యాప్టాప్ చార్జింగ్ సాకెట్స్, జీపీఎస్ ఆధారిత ప్రయాణికులు సమాచార వ్యవస్థ, ఎల్లీడి డెస్టినేషన్ బోర్డు వంటి ఫీచర్లను కల్పించారు. (Image Source: Twitter/@KapurthalaRcf)
ఈ డబుల్ డెక్కర్ బోగీల డోర్లను తెరవడానికి స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతీ బోగీలో చిన్న పాంట్రీ ఉంటుంది. ప్రయాణంలో రుచికరమైన ఆహరం, రిఫ్రెష్మెంట్ కూడా ఉండనుంది. (Image Source: Twitter/@KapurthalaRcf)
కొత్త డబుల్ డెక్కర్ బోగీలో ఎయిర్ టు ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. దాంతో పాటు అడ్వాన్సెడ్ ఫియట్ డిజైన్ ఉంటుంది. వీటితో పాటు సీసీటివి కెమెరాలు, నిప్పును గుర్తించే వ్యవస్థ కూడా ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. (Image Source: Twitter/@VIPortalINC)