భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

  • Nov 23, 2020, 18:24 PM IST

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు కనిపించింది. మేనిఫెస్టోలోని కీలక అంశాలు మీకోసం.

 

Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?

1 /10

సీఎం కేసీఆర్ ఢిల్లీ తరహాలో కొన్ని కార్యక్రమాలను ప్రారభించేలా మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటికి ఉచిత మంచినీటి సరఫరా ఇలా ప్రతీ నెల 20 వేల లీటర్లను సరఫరా చేయనున్నారు.  

2 /10

డిసెంబర్ నెల నుంచే ఉచిత నీటి సరఫరాను పొందే అవకాశం ఉంది. తరువాత ఎలాంటి నీటి బిల్లులు ఉండవు.

3 /10

కొత్తగా రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు, BHEL నుంచి మెహిదీపట్న మెట్రో ట్రైన్ సర్వీసు

4 /10

నాయి బ్రాహ్మణులు, ధోబీ ఘాట్లు, లాండ్రీ సర్వీసులు చేసేవారికి ఉచిత విద్యుత్తు

5 /10

కోవిడ్-19 సమయంలో మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపులను మినహాయింపు.. మొత్తం రూ.267 కోట్ల వరకు రాయితీ ( మార్చి నుంచి సెప్టెంబర్ )

6 /10

అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు మినిమం డిమాండ్ చార్జీలను మార్చి నుంచి సెప్టెంబర్ వరకు తగ్గించునున్నారు.  

7 /10

తెలంగాణ రాష్ట్రం కొత్తగా నాలా చట్టం తీసుకురానుంది. దానికి అధికా ప్రాధాన్యత ఇవ్వనుంది.

8 /10

పది కోట్లలోపు బడ్జెట్ ఉన్న సినిమాలకు జీఎస్టీ ఉండదు అని తెలిపారు.

9 /10

నగరంలో ఇకపై వైర్లు లేని సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారని మ్యానిఫెస్టో తెలిపింది.

10 /10

హైటెన్షన్ వైర్లను నేలలోపే విస్తరించనున్నారు. ( Feature Image: TRS\Twitter )