PUBG app in India: పబ్‌జి ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్

పబ్‌జి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పబ్‌‌జి మొబైల్ ఇండియాను గేమ్ యాప్ డిసెంబర్ మొదటి వారంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Nov 28, 2020, 23:06 PM IST

అయితే, తాజాగా కేంద్ర సాంకేతిక సమాచార శాఖ (Meity) వర్గాలు పబ్‌‌జి మొబైల్ ఇండియా యాప్ గురించి స్పందిస్తూ.. ఈ గేమ్ యాప్‌కి ఇంకా ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదని పేర్కొన్నాయి.

1 /7

పబ్‌జి యాప్ లాంటి వ్యాపారాలపై ఒకసారి నిషేధం విధించాకా పేరు మార్చి మళ్లీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తామంటే ఎలా కుదురుతుందని కేంద్ర సాంకేతిక సమాచార శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

2 /7

అలా అయితే టిక్ టాక్ లాంటి యాప్స్ నిర్వాహకులు కూడా అదే పని చేస్తారు. ఒక యాప్‌ని నిషేధించాకా.. మరోపేరుతో వస్తామంటే అందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా అని అభిప్రాయపడిన సదరు అధికారి.  

3 /7

పబ్‌‌జి మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ( PUBG India Private Limited ) పేరుతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద ఓ వ్యాపార సంస్థ తమ పేరు నమోదు చేసుకున్నట్టు మీడియాలోనూ వార్తలొచ్చాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు పొందుపర్చినట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నాయి.

4 /7

దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 118 చైనా యాప్స్‌పై ( China apps banned in India ) కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అందులో పబ్‌జి కూడా ఒకటి. అప్పటి నుంచే పబ్‌జి యాప్‌తో పాటు పబ్‌జి ప్రియుల ఆట కట్టించినట్టయింది.

5 /7

భారత్‌లో 100 మిలియన్ డాలర్స్ పెట్టుబడులతో భారతీయతతో పబ్‌జిని మళ్లీ భారత్‌లో ప్రవేశపెడుతామని గతంలోనే పబ్‌జి కార్పొరేషన్ ప్రకటించింది.

6 /7

సౌత్ కొరియాకు చెందిన తమ పేరెంట్ కంపెనీతో కలిసి భారత్‌లో వీడియో గేమ్స్, ఈస్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, ఐటి రంగాల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పబ్‌జి కార్పొరేషన్ అప్పట్లో పేర్కొంది.

7 /7

పబ్‌జి లాంటి యాప్స్‌పై భారత్ నిషేధం విధించినప్పటికీ.. దేశ భక్తితో సంబంధం లేకుండా పబ్‌జి లాంటి చైనా యాప్స్‌కే అలవాటుపడిన యువతకు ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ కానుంది.