ఇండియన్ రైల్వే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించినట్టయితే.. ఈ నెల నుండే రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులపై అభివృద్ధి రుసుము ( User development fee ) విధించే అవకాశాలు ఉన్నాయి.
Train tickets prices: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్
English Title:
Train tickets to get costlier as user development fee between Rs 10 to Rs 40 may be slapped on train ticket prices; AC tickets to become costlier than sleeper class
మరొక అంచనా ప్రకారం తెలుస్తోంది ఏంటంటే.. ఏయే రైల్వే స్టేషన్స్‌ని అయితే పూర్తి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తారో... ఆ తర్వాతే ఆయా రైల్వే స్టేషన్ల నుంచి టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ యూడీఎఫ్ చార్జీలు వర్తించనున్నాయని సమాచారం.
స్లీపర్ క్లాస్ ట్రెయిన్ టికెట్స్ నుంచి ఏసి టికెట్స్ వరకు తరగతుల వారీగా కనీసం రూ. 10 నుంచి గరిష్టంగా రూ. 40 వరకు పెరగనున్నాయి.
స్లీపర్ క్లాస్ ట్రెయిన్ టికెట్స్ ధరలతో పోల్చుకుంటే.. ఏసీ క్లాస్ టికెట్స్ ధరలు ఎక్కువగా పెరగనున్నాయి.
AC 1 క్లాస్ రైలు ప్రయాణికులపై అధిక మొత్తంలో యూడీఎఫ్ భారం పడనుండగా, AC 2 తరగతి రైలు ప్రయాణికులపై కొంత తక్కువ భారం, AC 3 క్లాస్ ప్రయాణికులపై ఇంకొంత తక్కువ భారం పడనుంది.
యూజర్ డెవలప్మెంట్ రుసుము వసూలు ప్రతిపాదనల ప్రకారం సాధారణ టికెట్ బుకింగ్‌పై యూడీఎఫ్ చార్జీలు వర్తించవు.
విమాన ప్రయాణికులకు విధించే యూజర్ డెవలప్మెంట్ రుసుముకు అనుగుణంగా రైలు ప్రయాణికులపై విధించే యూడీఎఫ్ కూడా ఉండనుంది.
యూజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశలో న్యూఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్, ఇండోర్, చండీఘడ్‌తో పాటు సుమారు 100 రైల్వే స్టేషన్లలో రైలు ఛార్జీలపై యుడిఎఫ్ అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే అధికారవర్గాలు తెలిపాయి.
Publish Later:
No
Publish At:
Monday, December 7, 2020 - 18:23
Mobile Title:
Train tickets prices: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్
Request Count:
50
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.