Lavanya Tripathi Valentine Day: 'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ట్ సింబల్ బెలూన్స్ తో పోజులిచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి.. పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలలో నటించింది.
2006లో మిస్ ఉత్తరాఖండ్గా ఎంపికైంది. 2012లో వచ్చిన 'అందాల రాక్షసి' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత 'దూసుకెళ్తా', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం' సినిమాల్లో కనువిందు చేసింది
ఇటీవలే 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటించి.. మెప్పించింది.