Mohan babu Family Dispute: జల్ పల్లిలో సౌందర్య ఆత్మ..?.. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు అదే కారణామా..?.. భయపడిపోతున్న స్థానికులు..

Mohan babu Jalpally residence: మోహన్ బాబు ఇంట్లో కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోహన్ బాబు జల్ పల్లి నివాసంలో కొన్నిరోజులుగా ఏదో తెల్లని శరీరంగల ఒక మహిళ రాత్రి పూట సంచరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు  వార్తలు వస్తున్నాయి.

1 /8

మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ ఘటన రాజకీయాలతో , సినీ ఇండస్ట్రీలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే కేసులు సైతం నమోదయ్యాయి.. ప్రస్తుతం మోహన్ బాబు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తొంది. పోలీసులు పలు మార్లు నోటీసులు జారీచేసిన కూడా మోహన్ బాబు నుంచి ఎలాంటి రిప్లై రావట్లేదని తెలుస్తొంది.  

2 /8

మరొవైపు మోహన్ బాబు మాత్రం.. ఢిల్లీ హైకోర్టు నుంచి తనపైన మీడియా కథనాలపై పలు ఆదేశాలను తెచ్చుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. మోహన్ బాబు ప్రస్తుతం జల్ పల్లిలోనే ఉన్నారని కూడా కొందరు అంటున్నారు.

3 /8

మోహన్ బాబు తన ఇంటి వద్ద జరిగిన ఘటనలో.. కంట్రోల్ తప్పి ఒక మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇది కాస్త సీరియస్ అయ్యింది. హత్యాయత్నం కేసులు నమోదు అయ్యింది. అయితే.. మోహన్ బాబు ఇంట్లో గత రెండు నెలల నుంచి అనేక గొడవలు జరుగుతున్నట్లు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది.

4 /8

పోలీసులు కూడా.. ఇక మీదట గొడవలు పడొద్దని ఇరుకుటుంబాలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. అయితే.. ఇటీవల జల్ పల్లిలో రాత్రిళ్లు ఒక మహిళ ఆత్మ జల్ పల్లీ సమీపంలోని ప్రాంతంలో సంచరిస్తుందని కూడా అక్కడి వాళ్లు చెప్తున్నారంట. ఇది నటి సౌందర్య ఆత్మ అని అక్కడి వాళ్లు అంటున్నారంట.

5 /8

సౌందర్య బతికి ఉన్నప్పుడు.. తనకోసం మోహన్ బాబు సలహా మేరకు జల్ పల్లిలోని స్థలం కొన్నారంట. అయితే.. ఆ తర్వాత ఆమె చనిపోవడం, ఫ్యామిలీ గొడవలు, ఆమె సోదరుడు మరణించడంతో ఈ ఘటన మరుగున పడిందంట. 

6 /8

కానీ సౌందర్య తల్లి మాత్రం.. జల్ పల్లి స్థలం గురించి మోహన్ బాబును కలిశారంట. కానీ అప్పట్లో ఏంజరిగిందో కానీ.. మరల ఆమె ఇటువైపు రాలేరంట. అయితే.. మోహన్ బాబు ఇంట్లో అశాంతికి, కుటుంబ తగాదాలకు కారణం జల్ పల్లిలోని ఇల్లేనని వార్తలు వస్తున్నాయి. ఆ స్థలంను సౌందర్య ఎంతో ఇష్టంతో కొనుక్కుందని, తన వాళ్లకు దక్కకుండా చేసినందుకు సౌందర్య తీరని కోరికతో ఉందని అక్కడి వాళ్లు అంటున్నారంట.  

7 /8

అందుకే మోహన్ బాబు ఇంట్లో అశాంతి, గొడవలు, ఒక రకంగా ఎప్పుడు లేనీ విధంగా మోహన్ బాబు కంట్రోల్ తప్పి .. హత్యయత్నం కేసు వరకు వెళ్లడంపైన కూడా.. ఆత్మ ఘోష ఉందని కూడా అక్కడి స్థానికులు అంటున్నారంట.   

8 /8

ఇదిలా  ఉండగా.. మోహన్ బాబు కుటుంబం ఆ ఇల్లును వదిలేస్తేనే సౌందర్య ఆత్మ శాంతిస్తుందని.. లేకుంటే.. ఇంకా ఇబ్బందుల్లో మోహన్ బాబు పడతారని అక్కడి వాళ్లు అంటున్నారంట. మొత్తానికి మోహన్ బాబు ఇంటి వివాదంలో కొత్త మలుపు చోటు తీసుకుందని చెప్పుకొవచ్చు.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.