Underground Village: ప్రపంచంలోనే ఏకైక అండర్‌గ్రౌండ్ గ్రామం ఎక్కడ, ఏంటో తెలుసా

బహుశా ఇప్పటి వరకూ మీరు అండర్ గ్రౌండ్ ఇళ్లు లేదా బంకర్ల గురించి లేదా షెల్టర్ల గురించి మాత్రమే వినుంటారు. కానీ ప్రపంచంలో ఓ ప్రాంతంలో ఏకంగా అండర్‌గ్రౌండ్ గ్రామం ఉందంటే నమ్ముతారా..నిజమే. ఎలా సాధ్యమనుకుంటున్నారా..సాధమైంది కూడా. భూమి కింద ఉన్న ఆ గ్రామం ఆస్ట్రేలియాలో ఉంది. ఆ వివరాలు, ఆ ఫోటోలు మీ కోసం..

Underground Village: బహుశా ఇప్పటి వరకూ మీరు అండర్ గ్రౌండ్ ఇళ్లు లేదా బంకర్ల గురించి లేదా షెల్టర్ల గురించి మాత్రమే వినుంటారు. కానీ ప్రపంచంలో ఓ ప్రాంతంలో ఏకంగా అండర్‌గ్రౌండ్ గ్రామం ఉందంటే నమ్ముతారా..నిజమే. ఎలా సాధ్యమనుకుంటున్నారా..సాధమైంది కూడా. భూమి కింద ఉన్న ఆ గ్రామం ఆస్ట్రేలియాలో ఉంది. ఆ వివరాలు, ఆ ఫోటోలు మీ కోసం..

1 /5

ఇక్కడ భూమి అడుగున నిర్మించిన ఇళ్లన్నీ పూర్తిగా ఫర్నిచర్‌తో ఉంటాయి. అన్ని రకాల సౌకర్యాలుంటాయి. భూమి అడుగున ఇక్కడ దాదాపు 15 వందల ఇళ్లున్నాయి. 3 వేల 5 వందలమందికి పైగా నివాసముంటున్నారు. ఈ ఇళ్లను డగ్ అవుట్స్‌గా పిలుస్తారు. వేసవిలో ఇక్కడి ఇళ్లలో ఏసీ అవసరముండదు, చలికాలంలో హీటర్ అవసరం లేదు. భూమి అడుగున కావడంతో ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. 

2 /5

కూబర్ ప్యాడీలో మైనింగ్ పనులు దాదాపు 1915లో ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఇదంతా ఓ ఎడారి ప్రాంతం. అందుకే వేసవి కాలంలో ఎండలు, చలికాలంలో చలి ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో చాలా  ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకే మైనింగ్ అనంతరం మిగిలిన ఖాళీ మైదానాల్లో నివసించేందుకు ఇలా చేశారు.

3 /5

ఇక్కడి ప్రజలు ఇళ్లతో పాటు తమ బిజినెస్ అవుట్‌లెట్స్, ఆఫీసులు అన్నీ అండర్ గ్రౌండ్‌లోనే నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో అండర్‌గ్రౌండ్ చర్చ్, అండర్‌గ్రౌండ్ సినిమా థియేటర్, అండర్‌గ్రౌండ్ మ్యూజియం, అండర్‌గ్రౌండ్ ఆర్ట్ గ్యాలరీ, అండర్‌గ్రౌండ్ బార్..ఆఖరికి అండర్‌గ్రౌండ్ హోటల్ కూడా ఉన్నాయి.

4 /5

బ్రిటీష్ న్యూస్ వెబ్‌సైట్ డైలీ మెయిల్ ప్రకారం..భూమి అడుగున ఉన్న ఈ ఇళ్లు..బయటి నుంచి సాధారణంగానే కన్పిస్తాయి. కానీ లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి. 

5 /5

దక్షిణ ఆస్ట్రేలియాలోని ఈ గ్రామం పేరు కూబర్ ప్యాడీ. ఇది ప్రపంచంలోనే వినూత్నమైన గ్రామం. ఇక్కడ దాదాపు 70 శాతం ప్రజలు అండర్‌గ్రౌండ్‌లోనే నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజల ఇళ్లు లేదా ఆఫీసులు అండర్‌గ్రౌండ్ అయినా అద్భుతంగా ఉంటాయి. భూమి నుంచి వందలాది అడుగుల కింద ఉంటాయి.