/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

India Victory: సొంతగడ్డపై టీమ్ ఇండియా విజయపరంపర కొనసాగుతోంది. ఒకదానితరువాత మరొకటిగా విజయాలు సాధిస్తోంది. మొత్తం ఏడాదిలో ఒక్క సీజన్‌లో కూడా ఓటమి ఎదురుకాలేదు. ఆ జైత్రయాత్రను పరిశీలిద్దాం.

స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 2021-22 సీజన్‌లో సొంతగడ్డపై  జరిగిన ఒక్క సిరీస్‌లోనూ భారత జట్టు ఓటమిని చూడలేదు. నాలుగు టెస్టుల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి..ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. శ్రీలంకతో జరిగిన పింక్‌బాల్‌ టెస్ట్‌లోనూ భారత్ విజయభేరీ మోగించింది. దీంతో టీమిండియా సొంతగడ్డపై వరుసగా 15వ టెస్ట్‌ విజయం నమోదు చేసింది. ఇటు మూడు వన్డేలు, 9 టీ20ల్లో విజయం సాధించింది.

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్‌..వరుసగా ఐదు సిరీస్‌లను అతడి కెప్టెన్సీలో గెలుచుకుంది. గతేడాది కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌..ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు, తాజాగా శ్రీలంకతో టీ20, టెస్ట్ సిరీస్‌ల్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన పింక్‌బాల్‌ టెస్ట్‌లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టారు. మొత్తం ఈ మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. 

ఇటు సీనియర్ స్పినర్ అశ్విన్‌ సైతం మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్ 434 వికెట్ల రికార్డును అధిగమించాడు. శ్రీలంకతో జరిగిన పింక్‌ బాల్‌ టెస్ట్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ స్టెయిన్ 439 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 442 వికెట్లున్నాయి. ఇలా భారత్ వరుస విజయాలతో టెస్ట్‌ ర్యాకింగ్‌ను సైతం మెరుగుపర్చుకుంటోంది.

Also read: Shreyas Iyer: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా శ్రేయస్​ అయ్యర్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Team india victory continues in home pitches, india wins the pink ball test against srilanka
News Source: 
Home Title: 

India Victory: వరుస విజయాలతో కొనసాగుతున్న టీమ్ ఇండియా జైత్రయాత్ర

India Victory: వరుస విజయాలతో కొనసాగుతున్న టీమ్ ఇండియా జైత్రయాత్ర
Caption: 
Team india victory ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
India Victory: వరుస విజయాలతో కొనసాగుతున్న టీమ్ ఇండియా జైత్రయాత్ర
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, March 15, 2022 - 08:49
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
34
Is Breaking News: 
No