Top 5 Smartphones: స్మార్ట్‌ఫోన్. ప్రస్తుతం అందరికీ అవసరంగా మారిన వస్తువు. మంచి ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో స్మార్ట్‌ఫోన్ కావాలంటే..8 వేల రూపాయల్నించి ప్రారంభమవుతాయి. 8 వేల రూపాయల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా అన్ని ఫీచర్లు ఉంటాయి. స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటుంది..బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. 8 వేల రూపాయల బడ్జెట్‌తో అందుబాటులో ఉన్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఓసారి పరిశీలిద్దాం..
Xiaomi Redmi 9A ఈ స్మార్ట్‌ఫోన్ 6.53 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ వి10 పై పనిచేస్తుంది. దీని ధర 7 వేల 999 రూపాయలు.
Tecno spark 7 ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 6.52 ఇంచెస్ డాట్‌నాచ్ డిస్ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 11 పై నడుస్తుంది. ఇందులో 64 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ ఉంది. 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు. దీని ధర 7 వేల 699 రూపాయలు.
Samsung Galaxy A10 ఈ ఫోన్ ఎక్సినోస్ 7884 ఎస్ఓసీ ద్వారా పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్ ఉంటుంది. 6.2 ఇంచెస్ హెచ్డి ఇన్ఫినిటీ డిస్ప్లే కలిగి ఉంటుంది. బ్యాక్ కెమేరా13 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సెల్‌తో ఉన్నాయి. దీని ధర 7 వేల 990 రూపాయలు
Realme C20 ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. మీడియాటెక్ హెలియో జి35 చిప్‌తో నడుస్తుంది. ఇందులో సింగిల్ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ధర 7 వేల 499 రూపాయలు మాత్రమే.
JioPhone next ఇక జియో నుంచి విడుదలైన 4జీ స్మార్ట్‌ఫోన్ ఇది. 5.45 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరాతో వస్తోంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర 7 వేల 299 రూపాయలు.