Fastest Ball By Indian Bowler: టీమిండియా తరుఫున అత్యంత వేగవంతమైన టాప్-5 బౌలర్ల వీళ్లే..

Team India Fast Bowlers: క్రికెట్ ప్రపంచంలో షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, జేమ్స్     అండర్సన్, షాన్ టైట్ వంటి మాజీ స్పీడ్ స్టార్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే టీమిండియా ఎక్కువగా బ్యాటింగ్‌కు దృష్టి పెట్టడంతో ఇతర జట్లతో పోలిస్తే మన పేస్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ రూపంలో మనకు ఓ స్పీడ్ స్టార్ దొరికాడు. టీమిండియా తరుఫున అత్యంత వేగంగా బంతి విసిరిన ఐదుగురు బౌలర్లు వీళ్లే.. 
 

  • Jan 05, 2023, 14:13 PM IST
1 /5

శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఉమ్రాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను 157 KMPH వేగంతో బౌలింగ్ చేశాడు

2 /5

భారత అత్యుత్తమ బౌలర్లలో జావగల్ శ్రీనాథ్ ఒకరు. టీమిండియాకు సొంతంగా ఒంటి చెత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిచాడు. అతను 1999 ప్రపంచకప్‌లో గంటకు 154.5 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు.

3 /5

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. అతను గంటకు 153.7 వేగంతో బంతిని వేశాడు. ఇర్ఫాన్ పఠాన్ 2007లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.   

4 /5

మహ్మద్ షమీ రివర్స్ స్వింగ్‌లో మాస్టర్. ఎలాంటి బ్యాటింగ్ అటాక్‌నైనా చిత్తు చేయగల సత్తా ఉన్న ఆటగాడు. షమీ గంటకు 153.3 వేగంతో బంతిని వేశాడు.   

5 /5

ప్రస్తుత టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఐదో స్థానంలో ఉన్నాడు. గంటకు 152.2 కిలోమీటర్ల వేగంతో బంతని విసిరాడు.