World Cancer Day: బ్రెస్ట్ కేన్సర్ నుంచి రక్షించే 5 ఆహార పదార్ధాలివే

ప్రతి యేటా ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ డే నిర్వహిస్తుంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిపై అవగాహన, చికిత్సపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా కేన్సర్ రకాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతుంటారు. హెల్తీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ వంటివాటికి దూరంగా ఉండాలి. అందుకే ఆరోగ్యకరమైన పదార్ధాల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి. 

World Cancer Day: ప్రతి యేటా ఫిబ్రవరి 4న ప్రపంచ కేన్సర్ డే నిర్వహిస్తుంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిపై అవగాహన, చికిత్సపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బ్రెస్ట్ కేన్సర్ కూడా కేన్సర్ రకాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతుంటారు. హెల్తీ లైఫ్ స్టైల్, స్మోకింగ్ వంటివాటికి దూరంగా ఉండాలి. అందుకే ఆరోగ్యకరమైన పదార్ధాల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి. 

1 /5

గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ అనేవి హెల్తీ డైట్ జాబితాలో ప్రముఖమైనవి. 2012లో నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ జర్నల్‌లో ప్రచురితమైన రీసెర్చ్ ప్రకారం గ్రీనీ వెజిటబుల్స్ ఎక్కువగా తినే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

2 /5

ఉల్లి, వెల్లులి ఉల్లి, వెల్లుల్లి వంటి కూరగాయల్లో ఆర్గో సల్ఫర్ కాంపౌండ్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రెస్ట్ కేన్సర్ పెరగకుండా నియంత్రిస్తాయి. 

3 /5

ఫ్యాటీ ఫిష్ ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలేనియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేన్సర్  నుంచి రక్షిస్తాయి. మహిళలు ప్రత్యేకంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తింటే చాలా మంచిది.

4 /5

క్రూసిఫెరస్ వెజిటబుల్స్ మహిళలకు క్రూసిఫెరస్ వెజిటబుల్స్ కచ్చితంగా తినాలి. ఇందులో ఐసోథియోసైనెట్స్, ఇండోల్స్ అనే ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.

5 /5

బీన్స్ బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బీన్స్ అనేవి హెల్తీ డైట్‌లో భాగమే. వీటితో బ్రెస్ట్ కేన్సర్ నుంచి కాపాడుకోవడమే కాకుండా ఇప్పటికే బ్రెస్ కేన్సర్ సోకిన రోగులకు వెయిట్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడతాయి.