IPL 2023: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక దూరం సిక్సర్లు బాదిన టాప్-5 భారత బ్యాట్స్‌మెన్ వీళ్లే..

IPL 2023 Latest Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌లో ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు అందరూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో లీగ్‌ చరిత్రలో అత్యధిక దూరం సిక్సర్లు బాదిన టాప్-5 భారత బ్యాట్స్‌మెన్ జాబితాను చూద్దాం..
 

  • Mar 13, 2023, 00:31 AM IST
1 /5

ఈ జాబితాలో టీమిండియా స్వింగ్‌ బౌలర్‌ ప్రవీణ్‌ కుమార్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ టోర్నీ అత్యధిక దూరం సిక్సర్ బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో అతనే ముందున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరుఫున ఆడిన ప్రవీణ్.. 124 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడం విశేషం.  

2 /5

ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప రెండో స్థానంలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నప్పుడు ఉతప్ప 120 మీటర్ల దూరం సిక్సర్ కొట్టాడు.  

3 /5

టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు యువరాజ్ కొట్టిన బంతి 119 మీటర్ల దూరం పోయింది. 

4 /5

కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున గౌతం గంభీర్ 117 మీటర్ల దూరం సిక్సర్ బాదాడు.  

5 /5

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు. చెన్నై తరఫున ధోని 115 మీటర్ల సిక్సర్ కొట్టాడు.