Tata Tiago Ev: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు, 5 ఏళ్లలో 10 లక్షలు ఆదా, ఎలాగంటే

దేశంలో అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసుకుందాం..అదే టాటా మోటార్స్ అందిస్తున్న టాటా టియోగో ఈవీ. పెట్రోల్-డీజిల్ ఖర్చుల్నించి ఉపశమనం కల్గిస్తుంది. 5 ఏళ్ల ఇంధన ఖర్చుల్ని లెక్కేసుకుంటే..ఈవీ ద్వారా ఏకంగా 10 లక్షల వరకూ ఆదా అవుతుందట. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే.

Tata Tiago Ev: దేశంలో అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసుకుందాం..అదే టాటా మోటార్స్ అందిస్తున్న టాటా టియోగో ఈవీ. పెట్రోల్-డీజిల్ ఖర్చుల్నించి ఉపశమనం కల్గిస్తుంది. 5 ఏళ్ల ఇంధన ఖర్చుల్ని లెక్కేసుకుంటే..ఈవీ ద్వారా ఏకంగా 10 లక్షల వరకూ ఆదా అవుతుందట. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే.
 

1 /5

టాటా మోటార్స్ అంచనాల ప్రకారం ఒక కస్టమర్ రోజుకు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ముంబైలో పెట్రోల్ ధర 106.31 రూపాయలుంది. అంటే 5 ఏళ్లలో టియాగో ఈవీ ఉపయోగించడం ద్వారా పెట్రోల్‌తో పోలిస్తే 10 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. 

2 /5

టాటా టియోగో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈవీలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, హైట్ ఎడ్జస్ట్‌మెంట్ డ్రైవింగ్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్ ఉన్నాయి. మల్టీ డ్రైవ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రేర్ వ్యూ కెమేరా, ఎలక్ట్రిక్ ఆటో ఫోల్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి.

3 /5

ఇందులో 19.2 కిలోవాట్స్ , 24 కిలోవాట్స్ రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు, 315 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. టియాగో ఈవీ వేరియంట్ ను 3.3 కిలోవాట్స్ లేదా 7.2 కిలోవాట్స్ హోమ్ ఛార్జింగ్‌తో వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 57 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుంది. 

4 /5

టాటా టియోగో ఈవీ ధర 8.69 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై..11.99 లక్షల వరకూ ఉంది. టాటా టియాగో నాలుగు వేరియంట్లు XE, XT, XZ plus, XZ plus tech luxలలో అందుబాటులో ఉంది. ఇందులో బ్యాటరీ ప్యాక్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి.

5 /5

Tata Tiago EV పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల నుంచి రిలీఫ్, కాలుష్యం తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్లపై ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే దేశంలోని విఖ్యాత కార్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల నిర్మాణంలో ఉన్నాయి. కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. టాటా టియాగో దేశంలోనే అత్యంత చౌక ఈవీ కారు ప్రవేశపెట్టింది. ఐదేళ్ల ఇంధన ధరలు పోల్చుకుంటే 10 లక్షల సేవ్ చేయవచ్చంటోంది కంపెనీ.