Allu Ayaan Birthday అల్లు అయాన్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అయాన్ బర్త్ డే స్పెషల్‌గా కొన్ని ఫోటోలు నెట్టింట్ల్ వైరల్ అవుతున్నాయి.
అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అల్లు పిల్లల అల్లరి మామూలుగా ఉండదు.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన పిల్లలు, భర్త చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
బన్నీ అయితే తన పిల్లలతో మామూలుగా అల్లరి చేయడు. అయాన్ కాస్త సైలెంట్‌గా కనిపిస్తాడు. కానీ అర్హ మాత్రం ఇళ్లంతా గోలగోల చేసేస్తుంటుంది.
అయాన్ ఎక్కువగా కెమెరా ముందుకు రాడు. కానీ బన్నీ ఈవెంట్లలో అయాన్ స్పెషల్‌గా మెరుస్తుంటాడు. సెట్స్‌లోనూ అయాన్ సందడి చేస్తుంటాడు.
అయాన్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు కొన్ని ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. బన్నీ, అయాన్ల పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయాన్ బర్త్ డే సందర్భంగా బన్నీ ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు. లవ్ ఆఫ్ మై లైఫ్.. మై స్వీటెస్ట్ చిన్ని బాబు అని ప్రేమను కురిపించాడు బన్నీ.