Vaikuntha Ekadashi 2025: తిరుమల సహా ప్రపంచ వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడాన్ని పరమ పవిత్రంగా భావిస్తుంటారు సనాతన హిందువులు. అయితే.. నిన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో కొంత మంది భక్తులు కన్నుమూయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి చైర్మన్ బీఆర్ నాయుడు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Vaikuntha Ekadashi 2025: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భావిస్తుంటారు. ఆ రోజున దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఈ సారి వైకుంఠ ఏకాదశి దర్శనాలను పది రోజులు పాటు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
వైకుంఠ ఏకాదశి అయిన 10వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పించనున్నారు. మరో వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం. టికెట్లు,టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. ఈ పది రోజులు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.
టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేశామన్నారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేయనున్నారు. ముఖ్యమంత్రి అదేశాల ప్రకారం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
భక్తుల సౌకర్యార్ధం 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేశారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండవని విజ్ఞప్తి చేశఆరు. అందరు భక్తులతో కలిసి SSD టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని చెప్పాలి. కొందరు తిరుమల పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు...ఆపలేరన్న అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరుతున్నామన్నారు. . HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ...భక్తులు మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు.