7 Sacred Ghats Of Kashi: కాశీకి వెళ్లేవాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన 7 పవిత్ర ఘాట్‌లు ఇవే..

7 Sacred Ghats Of Kashi: హిందువులకు అత్యంత పవిత్రమైన పురాతన నగరాల్లో కాశీ ఒకటి. ప్రళయ కాలంలోనే కాశీలో మహా శివుడు.. విశ్వనాథుడిగా ఇక్కడ కొలువైనాడు. అంతేకాదు సప్త మోక్షదాయక పట్టణాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఇక్కడ వచ్చే చాలా మంది భక్తులు మోక్షం కోసం వస్తారు. ఇక్కడ మొత్తంగా 64 ఘాట్‌లున్నాయి. అన్ని ఘాటలలో శవ దహనానికి సంబంధించిన అగ్ని సంస్కారాలు చేస్తుంటారు. అందులో అత్యంత పవిత్రమైన 7 ఘాట్‌లు ఏంటో చూద్దాం..

1 /7

దశాశ్వమేధ ఘాట్ - Dashashwamedh Ghat దశాశ్వమేధ ఘాట్ కాశీ (వారణాసి)లోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్.. కాశీకి వెళ్లినవారు.. ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్‌లలో ఒకటి.

2 /7

అస్సీ ఘాట్ - Assi Ghat అస్సీ ఘాట్ గంగ మరియు అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.    

3 /7

మణికర్ణికా ఘాట్ - Manikarnika Ghat మణికర్ణికా ఘాట్ పురాతనం మరియు పవిత్రమైన ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ హిందువులకు సంబంధించిన దహన సంస్కారాలను నిర్వహిస్తారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.

4 /7

హరిశ్చంద్ర ఘాట్ - Harishchandra Ghat హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర రాజు విశ్వామిత్రుడి పరీక్ష సత్యం, దాతృత్యం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు.  హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్‌లలో ఇది ఒకటి.

5 /7

తులసి ఘాట్ - Tulsi Ghat తులసి ఘాట్‌కి రామచరితమానస్‌ను రచించిన కవి తులసీదాస్ పేరు మీద ఈ ఘాట్ ఉంది.    

6 /7

సింధియా ఘాట్  - Scindia Ghat సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. 

7 /7

కేదార్ ఘాట్ - Kedar Ghat కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్‌లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న  కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్‌కు  ఆ పేరు వచ్చింది.