8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్‌ గిఫ్ట్.. కొత్త పే కమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్

8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ వచ్చేసింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ జీతంతో కలిపి ఒకేసారి ఖాతాలో జమ చేయనున్నారు. మరోవైపు కొత్త పే కమిషన్‌పై కూడా త్వరలోనే ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
 

1 /11

ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త పే కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉంది. ఈ కమిషన్ 2014లో ఏర్పాటవ్వగా.. దాని సిఫార్సులు 2016 నుంచి అమలులోకి వచ్చాయి.   

2 /11

7th పే కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కానుంది. దీంతో కొత్త పే కమిషన్‌పై అప్‌డేట్ ఉంటుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.  

3 /11

కొత్త పే కమిషన్ ఇప్పుడు ఏర్పాటు చేసినా.. దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.  

4 /11

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 20 శాతం నుంచి 35 శాతం వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.  

5 /11

కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు, పెన్షనర్లకు పెన్షన్‌ పెంపు ఉంటుంది.  

6 /11

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణాన్ని కొత్త పే కమిషన్ సమీక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జీతాల పెంపు గురించి కేంద్రానికి సిఫార్సు చేస్తుంది.  

7 /11

కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంద్రం 8వ పే కమిషన్‌ను ప్రకటించనుందని నిపుణులు చెబుతున్నారు.   

8 /11

కేంద్ర బడ్జెట్ 2025 ప్రకటనకు ముందు కొత్త పే కమిషన్ ప్రకటన ఉంటుందని అంటున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు తరువాత తమ జీతాలు, పెన్షన్‌లో ఎంత పెంపు ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  

9 /11

6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారిన సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. కేంద్రం ప్రభుత్వం చివరికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా ఫైనల్ చేసింది.  

10 /11

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.68కి పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.  

11 /11

గమనిక: ఇక్కడ అందజేసిస సమాచారం ఉద్యోగులకు అవగాహన కోసం మాత్రమే రాసినది. కచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.