Munkkaya Majjiga charu: మునక్కాయల మజ్జిగ చారు.. ఇలా చేస్తే నోట్లో వేళ్లు జుర్రుకోవాల్సిందే..!

Munkkaya Majjiga charu Recipe:మునక్కాయలు సాంబారు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. మునక్కాయలు రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఎప్పుడైనా మునక్కాయలతో మజ్జిగ చారు పెట్టుకున్నారా?. దీని రుచి అదిరిపోతుంది. సాధారణంగా మజ్జిగ పులుసు అంటేనే పెరుగుతో తయారు చేస్తాం. ఇందులో టమాటాలు ఉల్లిపాయలు వేసి తయారు చేసుకుంటారు .
 

1 /5

ఈసారి మీరు మజ్జిగ చారు పెట్టినప్పుడు కాస్త రుచి పెరగడానికి మునక్కాయలతో మజ్జిగ చారు తయారు చేసి చూడండి. ఇకపై మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ తయారు చేసుకుంటారు  

2 /5

మజ్జిగ చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. పెరుగు -అరకప్పు,  మునక్కాయలు- ఒకటి,  జీలకర్ర, ఆవాలు,  ధనియాలు ఒకటి స్పూను, ఎండుమిర్చి రెండు, ఉప్పు -రుచికి సరిపడా, ఇంగువ, నానబెట్టిన బియ్యం ఒకటి స్పూను, నూనె, కరివేపాకు, కొత్తిమీర.

3 /5

ముందుగా ఒక జారులోకి బియ్యం ధనియాలు, జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన మునగకాయలను మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు.  

4 /5

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి ఇందులో కాస్త నూనె పోసి గ్రైండ్ చేసుకున్న పేస్టు, మునక్కాయలు వేసి కొద్ది సేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరో వైపు చల్లారిన తర్వాత ఇందులో పెరుగు, ఉప్పు తగిన నువ్వు నీళ్లు పోసుకోవాలి.  

5 /5

 ఈ చారులో తాలింపు వేసుకోవాలి. ఇంత రుచికరమైన మజ్జిగ చారు ములక్కాడలతో తయారు చేసిన రెసిపీ అద్భుతంగా ఉంటుంది అందరూ ఇష్టంగా తినవచ్చు