Ira Khan Engaged: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ నుపుర్ తో అమీర్ ఖాన్ కూతురి ఎంగేజ్మెంట్.. మాజీ భార్యలే కాదు ఆమె కూడా వచ్చిందిగా!

Aamir Khan’s Daughter Ira Khan Gets Engaged: అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ జిమ్ ట్రైనర్‌ నూపుర్ శిఖరేతో తన రిలేషన్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళింది, ఈ జంట ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

  • Nov 19, 2022, 07:23 AM IST
1 /5

వీరితో పాటు,  ఐరా ఖాన్ సోదరుడు జునైద్ ఖాన్,  కిరణ్ రావు కుమారుడు ఆజాద్,  కజిన్ జీనత్ హుస్సేన్,  నటి ఫాతిమా సనా షేక్ కూడా ఈ కార్యక్రమంలో మెరిశారు. నూపుర్ శిఖరే చాలా మంది స్టార్‌కిడ్‌లకు జిమ్ ట్రైనర్‌గా ఉన్నారు,  అమీర్ ఖాన్‌కి కూడా గతంలో ఆయన శిక్షణ కూడా ఇచ్చారు. 2020 లాక్ డౌన్ రోజుల్లో ఈ ఇద్దరూ దగ్గరయ్యారు,  2021 వాలెంటైన్స్ వీక్‌లో ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ బంధాన్ని ప్రకటించారు.   

2 /5

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా క్రీమ్ కలర్ చీరలో కనిపించింది. అదే సమయంలో కిరణ్ రావు కూడా బ్లూ కలర్ చీర కట్టుకుని ఐరా ఖాన్ నిశ్చితార్థానికి వచ్చారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.   

3 /5

తేలికపాటి ఆభరణాలు ఇంకా తేలికపాటి మేకప్‌తో ఐరా ఈ గౌనులో అద్భుతంగా కనిపించింది. కాగా,  నుపుర్ శిఖరే కూడా  నలుపు రంగు టక్సేడోలో అందంగా కనిపించారు. ఈ నిశ్చితార్థంలో అమీర్ ఖాన్ తెల్లటి కుర్తా పైజామాలో కనిపించాడు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ మాజీ భార్యలు ఇద్దరూ కూడా వచ్చారు.   

4 /5

ఈ జంట తమ కుటుంబం - కొంతమంది సన్నిహితుల మధ్య అధికారిక నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోలు బయటకు రాగా అవి వెంటనే వైరల్ అయ్యాయి.  ఐరా ఈ కార్యక్రమం కోసం రెడ్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌను ధరించింది,  అందులో ఆమె చాలా అందంగా కనిపించింది.   

5 /5

Ira Khan Gets Engaged: అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ జిమ్ ట్రైనర్‌ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. ఐరా - నుపూర్‌ల రొమాంటిక్ ఫోటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్ళింది. సుదీర్ఘ డేటింగ్ తరువాత ఐరా ఖాన్ తన ప్రియుడు నూపుర్ శిఖరేతో నిశ్చితార్థం చేసుకుంది.