Sai Dharam Tej: అల్లు అర్జున్ గురించి సాయి ధరమ్ తేజ్.. ఏమన్నారంటే..!

Sai Dharam Tej about Allu Arjun: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరంతేజ్ మాట్లాడుతూ..  “టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు. కానీ మా అల్లు, మెగా ఫ్యామిలీలు ఎప్పటికీ ఒకటై  ఉంటాయి” అంటూ తెలిపారు. 

1 /5

“నిజానికి అల్లు అర్జున్,  రామ్ చరణ్ ఉన్నత స్థాయిలో ఉన్నారు.  వారి సక్సెస్ చూసి మేము ఏ రోజు బాధపడలేదు.  ఎందుకంటే మేమందరం ఒకే మొక్కకు చెందిన పూలము. ఒకే మొక్క పూలు ఎప్పుడు కూడా పోటీ పడవు. మేము అందరం కలిసి వికసిస్తాము” అంటూ తెలిపారు సాయిధరమ్ తేజ్. 

2 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు, మెగా కుటుంబాలకు.. ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అంతేకాదు ఈ రెండు కుటుంబాలలో ఉండే హీరోల మధ్య కూడా అంతే మంచి అవినాభావ సంబంధం ఉంటుంది.. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రచారం మొదలు పెట్టినప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు సపోర్టు చేయలేదనే నేపథ్యంలో అల్లు - మెగా హీరోల మధ్య గొడవలు మొదలయ్యాయి అని,  ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు అంటూ కూడా కామెంట్లు వినిపించాయి

3 /5

అయితే తాజాగా ఈ వార్తలపై సాయి ధరంతేజ్.. అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో తన బంధం ఎలా ఉంటుందో ఓపెన్ అయ్యారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్. రామ్ చరణ్ గురించి అలాగే అల్లు అర్జున్ తో రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. 

4 /5

సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. “అసలు నటనా రంగంలోకి రావాలని మేము ఏ రోజు అనుకోలేదు. ఉదయం 9 గంటలకు ఆఫీసుకెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి రావాలని ఎన్నో కలలు కన్నాను.  అయితే నటన రంగంలోకి వచ్చేసాను. అటు అల్లు అర్జున్,  రామ్ చరణ్ అలాగే.. నా సోదరుడు వైష్ణవ్ తేజ్ ఇలా ఎవరికీ కూడా మాలో నటుడు అవ్వాలనే ఆలోచన లేదు.కానీ అది సహజంగా వచ్చేసింది”.   

5 /5

ఇక మా మధ్య విభేదాలు ఉన్నట్టు బయటకి వస్తున్నాయి. కానీ ఎవరో కావాలనే నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.  మేమంతా ఎప్పుడు కలిసే ఉంటాము అంటూ కామెంట్లు చేశారు సాయి ధరమ్ తేజ్.