Actress Bold Photos; సాధారణంగా కొంతమంది హీరోయిన్లు, హీరోలు బెడ్రూంలో చేయాల్సిన సన్నివేశాలను పబ్లిక్ గా చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా శ్రియా శరన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఆమె ఈవెంట్ కు వెళ్ళింది అంటే చాలు తన భర్తతో లిప్ లాక్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె కోవ లోకే మరో స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది. పబ్లిక్ గా తన భర్తకు లిప్ లాక్ ఇవ్వడంతో అది చూడలేక ఆమె కూతురు కళ్ళు మూసుకుంది..ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో బంధించడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె చదువు పూర్తి అయిన వెంటనే మోడల్ రంగం వైపు అడుగులు వేసి 2000 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం తోపాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకుంది.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళ చిత్రం తమిళన్ ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ కూడా బాలీవుడ్ లోనే ఈమె ఎక్కువ క్రేజ్ అందుకుంది.
బాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి పేరు సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ క్వాంటికో వంటి సిరీస్ తో హాలీవుడ్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఈమె అక్కడే ఒక్కో చిత్రానికి రూ.12 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ సెటిల్ అయిపోయింది.
వయసులో తనకంటే చిన్నవాడైన హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప కూడా జన్మించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా పంచుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె భర్త నిక్ జోనస్ ఒకరికొకరు ప్రేమగా ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త పుట్టిన రోజు కావడంతో ప్రియాంక లిప్ లాక్ చేసింది. ఇకపోతే తన భర్తపై ఈమె చూపించిన ప్రేమను కూతురు చూడలేకపోయింది. ఛీ ఇదేం పాడు పని అన్నట్లుగా చూడలేక నవ్వుతూ కళ్ళు మూసుకుంది ఆ చిన్నారి.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి చూసిన నెటిజన్లు ప్రియాంక చోప్రా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతురు ముందు ఇలాంటి పాడు పనులు చేయడం పద్ధతి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.