Actress Ramya: ప్లీజ్.. ఆ వీడియోలను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య.. మ్యాటర్ ఏంటంటే..?

Kannada Actress Ramya: కన్నడ నటి రమ్య తాజాగా కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా మూవీలో తన వీడియోను వాడుకున్నట్లు రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు .ఈ మూవీలోని తన పర్మిషన్ లేకుండా పెట్టిన వీడియోలను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.
 

1 /6

కన్నడ భామ, మైసూర్ మాజీ ఎంపీ తాజాగా.. కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో .. "హాస్టల్ హుడుగారు బెకగిద్దరే" సినిమాలోని తన సన్నివేశాలను తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించి పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ సినిమాలో తన అనుమతి లేనిదే వీడియోను ఉపయోగించుకున్నారన్నారు.

2 /6

ఈ సన్నివేశాలను తొలగించాలని ఎన్నిసార్లు మూవీ టీమ్ కు చెప్పిన స్పందించలేదన్నారు. అంతే కాకుండా.. కోటి రూపాయల పరిహారం కూడా నటి రమ్య డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   

3 /6

ముఖ్యంగా..హాస్టల్ హుడుగారు బెకగిద్దరే మూవీలో కొన్ని క్లిప్పింగ్ లను ఉపయోగించుకున్నారని.. అది తనకు ఏ మాత్రం చెప్పకుండా వాడుకున్నట్లు నటి ఆవేదన వ్యక్తం చేశారు.  

4 /6

గతంలో పలు మార్లు ఈ సినిమాలోని సన్నివేశాలను క్లిప్పింగ్ లను తొలగించాలని కూడా నిర్మాతలకు చెప్పానని.. ఆయిన కూడా మూవీ సంస్థ నిర్మాతలు దీన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.     

5 /6

అయితే.. రమ్య గతంలో మైసూర్ ఎంపీగా కూడా పనిచేశారు..  నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన "హాస్టల్ హుడుగారు బెకగిద్దరే".. ఒక బ్లాక్ కామెడీ-డ్రామా చిత్రం. ఈ మూవీకి మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

6 /6

ఈ సినిమాలోని తన క్లిప్పింగ్ లు ఉన్న వీడియోలను తొలగిస్తే.. తాను కేసును ఉపసంహరించుకుంటానని కూడా నటి రమ్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రమ్య వేసిన కేసు మాత్రం ఇండస్ట్రీలో చర్చ నీయాంశంగా మారింది.