Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..

Akkineni Nagarjuna:  అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 

1 /6

అక్కినేని నాగర్జున, శోభితాదూలి పాళ్ల ఎంగేజ్ మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. కొన్నేళ్లుగా చైతు, ధూళిపాళ్ల రిలేషన్ లో ఉన్నట్లు కూడా అనేక రూమర్స్ వచ్చాయి.  దీనికి బలం చేకూర్చేలా వీరి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.  

2 /6

ఈ నేపథ్యంలో అనూహ్యంగా వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటికానున్న వార్త ట్రెండింగ్ మారింది. ఈ రోజు అక్కినేని నాగచైతన్య, శొభితా ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కూడా చక చక జరిగిపోయింది.

3 /6

ఫ్యామిలీ ఫ్రెండ్స్, కొంత మంది స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తన గారాల బిడ్డ.. ఎంగెజ్ మెంట్ ఫోటోలను స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 

4 /6

చైతు, శొభితా ధూళిపాళ్ల ఎంగెజ్ మెంట్ ఉదయం 9.42 నిముషాలకు జరిగినట్లు తెలుస్తోంది. నూతన జంటకు అభినందనలను ఎక్స్ వేదికగా నాగార్జున చెప్పారు.  మీ జీవితం ఎప్పుడు నవ్వుతూ, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాగార్జున ఎమోషనల్ అయ్యారు. దీంతో నాగార్జున కుటుంబం చాలా ఏళ్ల తర్వాత సంబరాల్లో మునిగిపోయింది.   

5 /6

మరోవైపు.. నటి శోభిత ధూళిపాళ్లది గుంటూరు జిల్లా తెనాలి అని తెలుస్తోంది. ఆమె 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. 2016 వ సంవత్సరం బాలీవుడ్లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా ఆమె తెరంగేట్రం చేశారు.  

6 /6

2018లో అడవి శేషు నటించిన గూడచారి సినిమాలో శోభిత నటించారు. అలాగే అడవి శేష్ నటించిన మరో చిత్రం మేజర్ లో సైతం శోభిత కనిపించారు. దీంతోపాటు ఆమె పలు వెబ్ సిరీస్ లలో  నటించారు.