Anupama Parameswaran photos : టాలీవుడ్లో క్యూట్ హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుపమ పరమేశ్వరన్..తన అందంతో, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది.. మొదటిసారిగా 2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. తెలుగులోకి మాత్రం అ ఆ సినిమాతో 2016 లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నది..
ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన అనుపమ పరమేశ్వరన్.. కట్టుబొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించింది.. అలా ఒకవైపు తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది..
చివరిగా టిల్లు స్క్వేర్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నది. ఈ సినిమాలో ఊహించని విధంగా అభిమానులకు గ్లామర్ డోస్ పెంచి.. అందాల విందు చేసింది.. అయితే తాజాగా ఇప్పుడు అనుపమకు సంబంధించి ఇండస్ట్రీలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.
ఈ విషయం విన్న అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు..అయితే అనుపమ ఒక ఫోటోని షేర్ చేయగా అందులో ఒకసారిగా తన ముఖానికి అయిన గాయాలతో ఒక ఫోటోని సైతం షేర్ చేసింది.. ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ.. ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు..
అయితే ఈ ఫోటో చూస్తే అనుపమ ఏదో సినిమా షూటింగ్ కి రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె తీసుకున్నటువంటి సెల్ఫీ ఫోటోని చూస్తే ఇది క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన అనుపమ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలు అయితే షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంటుంది.. మొత్తానికి అనుపమ మొహం పైన గాయాలతో కూడిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా అనుపమ షేర్ చేసిన ఈ ఫోటో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది.