Anushka - Thaman: అనుష్క శెట్టి అంటే తనకు చాలా ఇష్టమని, భాగమతి సినిమా హిట్ అయితే తనకు ఐఫోన్ ఇవ్వమని అడిగానని తమన్ తెలిపారు. ఇక సినిమా హిట్ అవ్వడంతో అప్పటినుంచి తనకు అనుష్క ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఐ ఫోన్ పంపిస్తూ ఉంటుందని , ఆమె వ్యక్తిత్వంగా చాలా మంచిది అని కూడా తెలిపారు థమన్.
అనుష్క శెట్టి గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో, పెర్ఫార్మన్స్ తో మంచి ఇమేజ్ అందుకోవడమే కాదు తన మంచి మనసుతో ఎంతోమంది సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఆమె మంచి మనసు గురించి మరొకసారి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ వెల్లడించారు.
ఎస్ ఎస్ తమన్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక ఎపిసోడ్లో భాగంగా తమన్ చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా తమన్ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో అనుష్క గురించి చాలా స్పెషల్ గా చెప్పారు. అలాగే ఆమెతో తనకున్న రిలేషన్ గురించి కూడా వివరించారు.
భాగమతి సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు సినిమా హిట్ అయితే నాకు ఐఫోన్ ఇవ్వాలని అడిగాను. అయితే ఆ మాటకి ఆమె ప్రతి ఏడాది సెప్టెంబర్ లో నాకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. ప్రస్తుతం నేను వాడుతున్న ఐఫోన్ కూడా ఆమె ఇచ్చిందే అంటూ తెలిపారు.
అనుష్క నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా మంచి పర్సన్. ఆమెది బంగారు హృదయం. ఆమె అందం గురించి పక్కన పెడితే ఆమె నాతో చాలా మంచిగా ఉంటుంది. ఇన్సైడ్ బ్యూటిఫుల్.. బంగారం అంటూ ఆమెను తెగ పొగిడేశారు. అంతేకాదు ప్రస్తుతం అనుష్కతో భాగమతి 2 సినిమా చేస్తున్నానని కూడా తెలిపారు తమన్.
భాగమతి సినిమా సమయంలో తనకు ఐఫోన్లు అంటే చాలా ఇష్టమని చెప్పారట. భాగమతి హిట్ అయితే ఐఫోన్ ఇవ్వాలని కూడా అడిగారట. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ లో తనకు ఐ ఫోన్ గిఫ్ట్ గా వస్తుంది అంటూ తెలిపారు. అనుష్క ద్వారా ఐఫోన్ యు వి ఆఫీస్ నుంచి తనకు ఐఫోన్ వస్తుందని ఇప్పుడు వాడుతున్న ఐ ఫోన్ కూడా ఆమె ఇచ్చిందే అంటే తెలియజేశారు. ఇకపోతే అనుష్క తనకు ప్రతి ఏడాది.. సెప్టెంబర్ లో ఐఫోన్ ఇస్తుందని చెబుతూనే భాగమతి 2 గురించి కూడా ప్రకటించేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.