Anushka: అనుష్క ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేది ఇద్దరే ఇద్దరు హీరోలను.. ప్రభాస్ మాత్రం కాదు..!

Anushka Shetty Instagram: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరొందిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ హీరోయిన్ గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ‌‌..అందరిని ఆకట్టుకుంటుంది. అది ఏమిటంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఇద్దరూ తెలుగు హీరోలను మాత్రమే ఫాలో అవుతోంది. అయితే, ప్రభాస్ మాత్రం అందులో లేకపోవడం విశేషం. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..

1 /6

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున నటించిన సూపర్‌ సినిమాతో పరిచయం అయిన అనుష్క, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలతో మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఆమె తరువాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో.. నటించి మంచి పేరు తెచ్చుకుంది.  

2 /6

 అయితే, అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 12 మందిని మాత్రమే ఫాలో అవుతుంది. ఇందులో ఇద్దరూ తెలుగు హీరోలు మాత్రమే ఉన్నారు. అయితే ఇద్దరు తెలుగు హీరోలు అనగానే తప్పకుండా.. అనుష్క ప్రభాస్ ని ఫాలో అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. వీరిలో ప్రభాస్ లేరు.  

3 /6

ఒకప్పుడు అనుష్క, ప్రభాస్ మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు కథనాలు వచ్చినా, ప్రస్తుతం అనుష్క ప్రభాస్‌ను ఫాలో అవ్వడం లేదు. ఇక ఈ విషయం కాస్త కొద్దిగా అనుష్క అభిమానులను అలానే ప్రభాస్ అభిమానులను సైతం నిరాశకు గురిచేస్తోంది.  

4 /6

ఇక ఈ హీరోయిన్ ఫాలో అవుతున్న ఇద్దరు హీరోలు ఎవరంటే.. ఒకరు రానా మరొకరు దుల్కర్ సల్మాన్.  

5 /6

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శెట్టి ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. ఆమె ఫాలో అవుతున్న మరి కొంతమందిలో పీవీ సింధు, రాజమౌళి, కృపి శెట్టి, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు ఉన్నారు.  

6 /6

 ఇక ఇప్పటివరకు అనుష్క శెట్టి 48 సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు సినిమాలు, ఒక మలయాళం సినిమాతో బిజీగా ఉన్నారు. కావలసిన రీతిలో అనుష్క పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె అభిమానులు ఆమె ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా.. అని తెగ ఎదురుచూస్తున్నారు.