PM Kisan Scheme: అన్నదాతలకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్..పీఎం కిసాన్ నిధులు 10వేలకు పెంపు

PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం కానుకలను ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పీఎం కిసాన్ పథకంపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది. 
 

1 /7

PM Kisan Scheme: అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కొత్త సంవత్సరం బహుమతి అందించారు.  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయించాలని నిర్ణయించారు.  

2 /7

2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోంది. రూ. 2000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాలో సొమ్మును జమ చేస్తుంది. ఈ మొత్తం ఇప్పుడు రూ. 10వేలకు పెంచుతున్నట్లు ప్రధానమంత్రి మోదీ ఎక్స్ ఖాతాలో తెలిపారు.   

3 /7

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాలో నేరుగా 10,000 చేస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందని..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ త్వరలోనే ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్ ప్రకటన  చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి.   

4 /7

అయితే దానికంటే ముందే ఆ మొత్తాన్ని రూ. 10వేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా వెల్లడించారు.   

5 /7

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 6ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ స్కీముకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. రైతులకు పంటసాయం కింద బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 వాయిదాలను చెల్లించింది.   

6 /7

కొత్త ఏడాది ఫిబ్రవరి 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడంతో వారిలో ఆనందోత్సాహాలను రేపింది.   

7 /7

2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ స్కీం అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ పంట సాయం ఏడాదికి ఉచితంగా 6వేల రూపాయలను అందిస్తుంది. దీంతో ఈ స్కీముపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.